రూలర్ Born
For The Society
-kcnaidu1@gmail.com
పవిత్రానాయ సాధునాం వినాశాయ చదుష్క్రుతామ్!
ధర్మ పరిస్థాపనా పార్థాయ సంభవామి యుగే యుగే!!
"ప్రజలను రక్షించుటకు, దుర్మార్గులను నశింపజేయటకు ధర్మాన్ని పున:స్థాపించుటకు ప్రతి యుగమున నేను జన్మిస్థాను" అని శ్రీకృష్ణుడు చెప్పాడు.
“మన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏటా నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నాయి. అంటే సగటున ఒక కుటుంబానికి లక్ష్యా
యాభై వేల రూపాయలన్న
మాట. ఆయినా ఇంకా ఇళ్ళు లేని పల్లెలున్నాయి .కరెంటు
లేని విలేజ్ లు ఉన్నాయి.. రోడ్లు లేని గ్రామాలున్నాయి. మంచినీళ్ళు లేని ఊళ్ళున్నాయి. సాధారణ జ్యరానికే నేల రాలే వారు వేలు. ఉద్యోగాల్లేక, పెళ్ళిళ్ళు కాలేక పరువు కోసం నరకయాతన అనుభవించే యువత లక్షలు. రెండు పూటల కడుపు నిండా తిండి లేని వారు అరవై కోట్ల పై మాటే. ప్రపంచంలోని నిరక్షరాసుల్లో సగం మంది భారతీయులే! మరి ఏమవుతుంది ఈ ప్రజాధనం? ....”
“నల్ల ధనాన్ని వెలికి తీస్తే ఇప్పటివరకు మన దేశం చేసిన అప్పులన్నీ తీర్చవచ్చని అంచనా.
ఇంకా మిగిలిన ఆ ధనాన్ని భారతీయులందరికీ పంచి తే తలా లక్షరూపాయలు పైగానే
వస్తుందట....”
లక్షల కోట్లు...అక్రమార్జన...
ఇంతటి అవినీతి సంపాదన ఎలా సాధ్యం
?
ప్రభుత్వాలు... వ్యవస్థలు ... ఏంచేస్తున్నట్లు..?
చట్టాలు లేవా? ఉంటే ఎందుకు అమలు చేయలేదు!?
మరి దుష్టశిక్షణ,ధర్మపరిరక్షణకు ఆ దేవుడు ఎప్పుడు ఎలా వస్తాడు..?
*****
శనివారం.
సమయం ఉదయం ఏడుగంటలు.
రామాలయం.
గుడి పరిసరాలు ప్రశాంతంగా,ఆహ్లాదకరంగా ఉన్నాయి. కోనేటిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. ధ్వజస్తంభం దగ్గర భక్తులు కొబ్బరి కాయలు కొడుతున్నారు. అక్కడక్కడ కూర్చూని సేదతీరుతున్నారు. కొబ్బరి చిప్పలు పగులగొట్టి, తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.తల్లులు బిడ్డలకు పాలిస్తున్నారు. గుడి వాతావరణం అద్భుతంగా ఉంది.
శనివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. క్యూ లో నిలబడి దైవ ధర్శనానికి వెళ్తున్నారు. గుడి లోపలినుండి వేదమంత్రాలు లీలగా వినిపిస్తున్నాయి.
ఇంతలో ఒక్కసారిగా భారీశబ్దం. ఆ చప్పుడుకు పరిసరాల్లో ఉన్నా పావురాలు బెదిరిన చూపులతో, అరుపులతో దూరంగా పారిపోయాయి. భక్తులలో అయోమయం! మొదట బాణసంచా పేలుడేమో అనుకున్నారు. అయినా అంతా చప్పుడా అంటూ ఆశ్చర్యపోయారు. జరగరానిది ఎమో జరిగిందని అనుమానించారు. అది బాణాసంచా కాదు ... బాంబు! గర్భగుడి లో నుండి దట్టమైన పొగ ఆకాశం వైపు వెళుతొంది. భారీ ప్రేలుడు జరిగినప్పుడు ఏర్పడేపెద్ద శబ్ధం. ఆలయంలో గర్భగుడి ప్రక్కన పాలరాతి పీఠం కింద గుర్తు తెలియని వ్యక్తులు అత్యాధునిక ప్రేలుడు పధార్తాన్ని ఉంచి, సెల్ ఫొను ద్యారా రిమోట్ కంట్రోల్ పధ్దతితో పేల్చేశారు. దాని ధాటికి పది మంది అక్కడికక్కడె చనిపోయారు. పూజారులు
ప్రార్థన చేస్తున్న వారు అదే భంగిమ లో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు పిల్లలు కుడా ఉన్నారు. మరో యాభై మంది కి పైగా గాయపడ్డారు. గర్భగుడి వద్ద రక్తం మడుగు కట్టింది. మానవ మాంస ఖండాలు చెల్లాచెదురుగా పడిపొయాయి. పేలింది బాంబు అని తెలియగానే అక్కడంతా అల్లకళ్లోలం. భయానక వాతావరణం! ఎవరికి వారు బయటికిపడేందుకు తొక్కిసలాట!
గుడి పరిసరాల్లో కూర్చుని, పసిబిడ్డకు పాలు పడుతోంది జ్యోతి. ప్రాణభీతితో భక్తులు గుడి ముఖద్యారం వైపు పరుగు
తీస్తున్నారు.ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నదని గ్రహించింది జ్యోతి. బిడ్దను జాగ్రత్తగా పట్టుకుని పరుగులు తీయడానికి పైకి లేచింది. అంతలో ఎవరో బలంగా తోయడంతో అదుపు తప్పి పడిపోయింది. ఆమె చేతిలోంచి జారి పాప కొద్ది దూరంలో పడింది. క్రింద పడగానే పాప భయంతో కెవ్వున అరిచింది.
" పాప ...పాప..!!"
అంటూ అరుస్తూ పాప దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఉరుకుల పరుగుల మీద వస్తున్న జనం మళ్ళీ ఆమెను దూరంగా నెట్టేయడంతో ఆమె మరింత దూరంగా పడిపొయింది.
"నా బిడ్డను కాపాడండి ! కాపాడండి ! " అంటూ ఆమె రోదిస్తోంది. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. ఆమె అరుపులు అరణ్యరోదన గానే మిగిలిపోయాయి. ఇక పాపదగ్గరకు వెళ్ళడం కష్టం అనుకుంది. అయినా ఆమె పాప కోసం ప్రయత్నించింది.ఏదో పక్షి వింతగా అరచుకుంటూ ఎగిరిపోయింది.."
గుంపులు గుంపులుగా వస్తున్నారు జనం. క్రింద పడి భయంతో ఏడుస్తోంది పాప. ఆ పాపను చూడకుండా ప్రాణభీతితో పరుగులు తీస్తున్న ఒకావిడ పాప పొట్ట మీద కాలు పెట్టబోయింది. అంతలో ఆమె పాదాన్ని పాప శరీరం మీద పడకుండా తన కుడి చేత్తో ఆమె పాదాన్ని అలా ఆపి, పాపను ఎడమ చేతితో దగ్గరికి లాక్కున్నాడు విజయ్.
జ్యోతి తన బిడ్డను కాపాడిన విజయ్ ను దూరం నుండి చూసింది. ఆమె కు అత ను తేజస్సు తో వెలిగిపోతున్న తారక రాముడిలా కన్పించాడు. లోక రక్షకుడిగా అవతారమెత్తిన శ్రీకృష్ణుడిలా కన్పించాడు. ఆమె అప్రయత్నంగా తన రెండు చేతులెత్తి అతడికి నమస్కరించింది.
పాపను భుజాల మీదకు ఎత్తుకొని క్షణం వైపు చుట్టూ చూశాడు! చుట్టుప్రక్కలంతా జన ప్రవాహం, అర్తనాదాలు,అరుపులు,పొలికేకలు,ఏడుపులు.. అంతా దిక్కుతోచని పరిస్థితి. అయినా పాప తాలుకు వ్యక్తుల కోసం అతని కళ్ళు చురుకుగా గాలిస్తున్నాయి.
పాపకోసం విజయ్ వైపు చూస్తూ, చేతులు ముందుకు చాపి "పాప...పాప..." అని అరిచింది జ్యోతి. దూరంగా ఉన్న అతనికి ఆ మాటలు విన్పించలేదు. అంతలో జనం అడ్దురావడంతో ఆమె కు అతను కన్పించలేదు.
సంఘటన జరిగిన కాసేపటికి పోలీసులు వచ్చారు, పరిస్థితులు అదుపులో కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పటికే భారీగా త్రోక్కిసలాట. ఆ ప్రాంగణమంతా చెప్పులే!
కొద్ది నిముషాల్లోనే అంబులెన్సులు వచ్చాయి. అప్పటికే తేరుకొన్నకొందరు దుప్పట్లను స్ట్రెచర్లుగా మార్చి, రక్త మోడుతున్న క్షత గాత్రుల్ని అంబులన్స్ లోకి, ప్రైవేటు వాహనాల్లోకి చేర్చారు. ప్రేలుడు జరిగిన విషయం క్షణంలో దావానలంలా చుట్టుప్రక్కలంతా వ్యాపించింది. కొంత మంది పోలీసులకు, ప్రభుత్వానికి, ప్రతిపక్ష నాయకులకు, లీడర్లకు, వారి వారి శ్రేయోభిలాషులకు వార్తలను చేర వేస్తున్నారు. పత్రికల వాళ్లు, ఛానెళ్ళ వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా, వ్యతిరేఖంగా తమ ఎడిటర్ల సూచనలతోవార్తలను ప్రసారం చేస్తున్నారు.
వేల సంఖ్యలో అల్లరి మూకలు రోడ్ల పైకి చేరుకున్నారు. గుడి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహవేశాలతో విధ్వంసానికి దిగారు. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అల్లరిమూకలతో పాటు ప్రజలు కూడా దూరంగా పారిపోయారు. పాప కోసం బోరున విలపిస్తూ ఓ వైపు జ్యోతి, పాప ఆచూకి కోసం వెతుకుతున్న విజయ్ మరోక వైపు వెళ్ళిపొయారు.
రాన్రాను పరిస్థితి అదుపు తప్పుతోంది. అల్లరి మూకలు దుకాణాలను,పెట్రోలుబంకులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగారు. రాళ్లవర్షం కురిపించారు. ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తవాతావరణం నెలకొంది.పోలీసులు 144 వ సెక్షన్ విధించారు. నగరంలోని పోలీసులు హుటా హుటిన అక్కడికి తరలి వచ్చారు. పోలీసు దళాలు అల్లరి మూకల పైకి నీటి ఫిరంగులు, రబ్బరు తూటాలు... భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. సుమారు రెండు గంటల తరువాత పరిస్థితి అదుపు లోకి వచ్చింది.
అక్కడ్నుంచి ఇక చెసేదేమీలేక పాపను తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు విజయ్.
******
"ఎన్నికలు వస్తున్నాయి గెలవాలంటే ఓటర్లకు కరన్సీనోట్లు,మద్యం పంపిణీ చేయాలి" పార్టీఫండు ఎవరెక్కువ ఇస్తారో, ఎన్నికల్లోఎవరెక్కువ ధనం వరదలా పారిస్తారో, వాళ్ళకు ఎన్నికల్లోనిలబడేందుకు సీటు గ్యారంటీ! అయితే దానికి కూడా డబ్బు కావాలి. డబ్బు సంపాదించాలి, త్వరగా డబ్బు సమకూర్చుకోవాలి... ఎలా? అన్న ఆలోచన రాగానే క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదుఎమ్మెల్యే రాయన్న. మద్యం వ్యాపారి ధర్మారావుకు, నంబర్ వన్ కాంట్రాక్టర్ కోటయ్య కు ఫోన్ చేసి "సాయంకాలం పార్టీ ఉంది. రండి..." అంటూ ఆహ్వానించాడు.
ఎమ్మెల్యేగెస్ట్ హౌస్ లో పార్టీ మొదలైంది. చిప్స్,చికెన్ ముక్కలు బంగారు వర్ణపు ద్రవాలు ఖాళీ అవుతున్నాయి. మద్యం రెండు పెగ్గులు పూర్తయ్యేసరికి సినిమా తారల రొమాన్స్ తో మొదలైన సంభాషణ సచిన్ బ్యాటింగ్ వరకూ వెళ్ళింది.
గెస్ట్ లు మంచి మత్తులో ఉన్నారని కన్ ఫర్మ్ చేసుకొన్నాక అసలు పాయింట్ కి వచ్చాడు రాయన్న.
"మీ వ్యాపారానికి ఇన్నాళ్ళు అండగా ఉన్నాను. దానికి ప్రతిఫలంగా మీరు నాకు నాకు కొంత ఇచ్చారు." ఇప్పుడు ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి. మీరు నాకు “అన్ని” రకాలుగా సహాయం చెయ్యాలి. మీ రుణం ఉంచుకోను. నాకు మీకన్నా మంచి స్నేహితులు లేరు, సహాయం చేసే
వాళ్ళు కూడా లేరు... అన్నాడు ఉఫోద్ఘాతంగా సెంటిమెంట్ తో.
"మంచి వ్యాపార లక్షణం గల వాళ్లు ఎప్పుడూ ఏ పార్టీ కి అనుకూలంగా పని చెయ్యరు.చెయ్యకూడదు. ముఖ్యంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా..." అనుకొని తన తెలివితేటల్ని ప్రదర్శించాడు ధర్మారావు.
"మీరు అడగాలా! మీలాంటి వారికి సాయం చెసే అదృష్టం ఎంత మందికి లభిస్తుంది! రాబోయె ఎన్నికల్లో గెలిచి మన పార్టీ అధికారం లోకి వస్తుందని నాకు నమ్మకం ఉంది! కానీ ప్రతిపక్షం వాళ్లు సర్వే ఫలితాలు ప్రకారం మా పార్టీ రూలింగ్ లోకి వస్తుందంటున్నారు..."
అని అర్ధోక్తిగా ఆపు చేశాడు.
ఆమాటలకు ఎమ్మెల్యే గట్టిగా నవ్వాడు!