చేసింది. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 120 బి , రెడ్ విత్ 420,471, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(2) రెడ్ విత్ 13(1) సి క్రింద కేసులు నమోదు చేసింది.
విజయ్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. కోర్టుకు తరలించింది. కోర్టు 14 రోజులు జుడీషియల్ రిమాండ్ విధించింది.
విజయ్ అరెస్ట్ వార్త దావానలంలా వ్యాపించింది.
విజయ్ అరెస్ట్ వార్త తెలిసినవెంటనే విజయ్ మద్దతు దారులు రెచ్చి పోయారు.
విజయ నడుపుతున్న స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు విద్యార్థులు రోడ్డెక్కారు . హాస్పిటల్స్ మూసేయించారు. రోగులు అవస్థలు పడ్డారు. ఫ్యాక్టరీ మూసేసి ఉద్యోగులు, కార్మికులు ధర్నాలు చేసారు. లారీలు ఎక్కడిక్కడే ఆపేసి ధర్నా చేస్తున్నారు.
ధర్నాలతో కృష్ణా నగర్ కాలనీ వాసులు షాపులు మూసేయించారు. టైర్లు తగులబెట్టారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అప్పటికే 'కొన్ని సంఘాలు ' మద్దతు తెలిపాయి. కొంతమంది సంఘీభావం ప్రకటించారు.
విజయ్ ను వెంటనే విడుదల చేయాలి. ఆయన ప్రజల పాలిట దేవుడు. అతడికి ఏమైనా జరిగితే , ఆతరువాత జరిగే వాటికి ప్రభుత్వమే భాద్యత వహించాల్సి వస్తుంది...వెంటనే అతడ్ని విడుదల చేయా లంటూ రాస్తారోకో లు చేశారు. టీవీ లలో అసలు వార్తలకు , పెయిడ్ వార్తలకు తేడా లేకుండా వార్తలొస్తున్నాయి.
విజయ్ అరెస్ట్ వార్త ఒక సంచలనం అయ్యింది.
కృష్ణా నగర్ కాలనీ లో తమ దేవుడు ఇక లేడని తనువు చాలించారన్న వార్తలు గుప్పుమన్నాయి....కాలనీలో సహజ మరణాలన్నీ కూడా ఆత్మలయ్యాయి!
విజయ్ కోసం ఆత్మహత్యలు అంటూ వార్తలొచ్చాయి.
“ఒకటి, రెండు, మూడు... అంటూ చానెళ్ళ వారు చావు రాజకీయాలు మొదలెట్టారు. కాలనీ లో అక్కడక్కడా విగ్రహాలు కూడా మొలుస్తున్నాయి”.
విజయ్ పాపులారిటీ అంతకంతకు పెరిగిపోతోంది.
విజయ్ కేసు కోర్టులో కొద్ది రోజుల్లోనే ప్రారంభం అయ్యింది.
*****
కోర్టు హాలు.
విజయ్ బోనులోకి వెళ్ళాడు. జడ్జ్ తన సీట్లో కూర్చున్నాడు. ప్రేక్షకుల గాలరీలో కుర్చుని వున్నాడు ఆనందరావు. కంపెనీ సెక్రటరీ కల్పన, సిబిఐ జెడి ప్రకాష్ కూడా హాజరయ్యా రు. అంతలో అక్కడికి లాయర్ జ్యోతి వచ్చింది. సిబిఐ లాయర్ రమేష్ ఆమె వైపు అదోలా చూశాడు. ఆమె పట్టించుకోలేదు.
జ్యోతి ని చూడగానే అదిరిపడ్డాడు ప్రకాష్. ఆమె దేశంలోనే టాప్ టెన్ లాయర్ల లో ఒకరు. నిజాయితీ పరురాలిగా పేరుంది. ఆమె ఇలా రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలుగజేసింది.
'భారతీయ సాక్షా ధారాల చట్టం' ప్రకారం ఇలాంటి కేసుల్లో నేరాన్ని ఎక్కువగా నిరూపించాల్సిన భాద్యత ఎక్కువగా ప్రాసిక్యూషన్ మీదే ఉంటుంది.
సిబిఐ లాయర్ రమేష్ తన వాదనల్ని ప్రారంభించాడు.
"యువరానర్! ఇంతకు ముందు జరిగిన సంఘటనలు బ్రీఫ్ చేస్తాను. విజయ్ తన బినామీలతో అక్రమం గా డబ్బు సంపాదిస్తున్నాడు. మోసాలు చేస్తున్నాడు.ఐదేళ్ళ క్రితం ఏమీ లేని ఇతను ఆర్ధిక నేరాలు చేసి డబ్బులు సంపాదించాడు. ఇతను తన బినామీ ల తో కలిసి ఒకేసారి బ్యాంకుల నుండి డబ్బులు విత్ డ్రా చేయించి, బ్యాంకులను దివాలా తీయించి, స్టాక్ మార్కెట్లను, ప్రజలను తప్పుదోవ పట్టించాడు. ఇతని వలన స్టాక్ మార్కెట్ లో ఒకేరోజు 4 లక్షల కోట్లు నష్టం జరిగింది. ఇతడి అక్రమ సంపాదనను జప్తు చేసి పేదలకు పంచాలని, ఇతడ్ని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను..."
జ్యోతి లేచి అతని మాటలకు అడ్డుపడు తూ "నా క్లయింట్ తప్పు చేశాడని రుజువు కాకుండానే శిక్షలు గురించి మాట్లాడుతున్న సిబిఐ లాయర్ ను చూస్తే జాలేస్తుంది. పత్రికల్లో వచ్చిన ఊహాజనితమైన వార్తలకు కట్టు కథలు అల్లి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నాడు. లాయర్ కి రైటర్ గా మంచి భవిషత్తు ఉంది! నా క్లయింట్ నేరం చేశాడని చెప్ప డానికి ఏమీటీ ఆధారం...."
రమేష్ కోపంతో అన్నాడు. "ఈ వృత్తి లో నాకు పాతికేళ్ళ అనుభవం ఉంది. ఎలా మాట్లాడాలో తెలుసు! మీరు క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతిస్తే నిరూపిస్తాను యువరానర్..."
'పర్మిషన్ గ్రాం టెడ్' అన్నాడు జడ్జ్.
సిబిఐ లాయార్ ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తరువాత గొంతు సవరించుకున్నాడు. అలా ప్రశ్నలు అడగడానికి విజయ్ దగ్గరకు వచ్చాడు.
అతడి ప్రేపరేషణ్ చూడగానే డిఫెన్స్ లాయర్ జ్యోతికి నవ్వొచ్చింది. కోర్టులో అనవసరంగా నవ్వకూడదని కంట్రోల్ చేసుకుంది. విజయ్ ను చూసింది. సైగలతో అతడికి ధైర్యం చెప్పింది.
"నీ పేరేమిటీ?" సిబిఐ లాయర్ రమేష్ ప్రశ్నించాడు.
విజయ్ చెప్పాడు.
"ఐదేళ్ళ క్రితం ఎక్కడ పనిచేసేవారు?"
సిటీ కాలేజ్ లో.
"ఎ జాబ్?".
లెక్చరర్ గా .
"అప్పుడు మీకు నెలకు జీతమెంత?"
సుమారు ఫాతిక వేలు.
" అలాగయితే ఫాతిక వేల జీతం తో శిరీష ఇండ స్ట్రీస్ ఎలా కొన్నారు? శ్రీ కృష్ణా లారీ సర్వీసెస్, శ్రీకృష్ణా విద్యా సంస్థలు, శ్రీకృష్ణా హాస్పిటల్స్....కు పెట్టుబడి ఎలా వచ్చింది. వాటిని ఎలా సొంతం చేసుకున్నారు...."
ఆ ప్రశ్న అర్థం కా నట్లు ముఖం పెట్టాడు. మీరగుతున్న ప్రశ్న ఏమిటో కూడా నాకు అర్థం కాలేదు. వాటికీ నాకు ఏ సంబంధం లేదు! శిరీష ఇండ స్ట్రీస్ లో నేను ఓ మామూలు 'ఉద్యోగి' మాత్రమె!"
"వ్వాట్!" అని అదిరిపడ్డాడు లాయర్ రమేష్ .
"యస్. నాకూ వాటికీ ఏ సంబందం లేదు. నా పేరు మీద ఏ సంస్థ లేదు. రిజిస్ట్రే షన్ కూడాలేదు..."
"ప్రేక్ష కుల గ్యాలరీ లో ఉన్న ఆనందరావు ఉలిక్కిపడ్డాడు. "న్నో...ఆ కంపెనీ అతనిదే. నా దగ్గరే కొన్నాడు...." అని గట్టిగా అరవాలనుకున్నాడు. ఎలుగెత్త లేక పోయాడు.
అంతలో జ్యోతి లేచి నిలబడింది. "ఐ అబ్జెక్ట్ యువరానర్... నా క్లయింట్ కు సంబంధం లేని ప్రశ్నలు అడిగి కోర్టు సమయం వృధా చేస్తున్నారు! సరియైన ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు...."
ఆ మాటలకు జ్యోతి వైపు కోపంగా చూసాడు. ఆ తరువాత జడ్జ్ వైపు తిరిగి అన్నాడు.
"మిలార్డ్! ఈ కేసుకీ దీనికీ సంబంధం ఉంది. అలాగే అతని బినామీ సంస్థల గురించి సిబిఐ 'అన్ని' ఆధారాలు సేకరించింది. మీరు అనుమతిస్తే మరి కొన్ని ప్రశ్నలు అడిగి ముద్దాయి నోటి వెంటే సమాధానం చెప్పిస్తాను...."
"అబ్జె క్షన్ ఓవర్ రూల్ద్ ..." అన్నాడు జడ్జ్.
"మీరు శిరీష ఇండ స్ట్రీస్ కొనలేదా! ఆ కంపెనీ మీది కాదా? దానికీ మీకు సంబంధం లేదా? బ్యాంకు నుండి ఆ కంపెనీ పేరు మీద అప్పుచెయ్యలేదా... ?"
"లేదు. లేదు. నేను ఆ కంపెనీ కొనలేదు. ఆ కంపనీ ఇప్పటికీ దాన్ని స్థాపించిన ఆనందరావు పేరుమీదే ఉంది. నేను ఆయన పర్సనల్ సెక్రెటరీ ని. కంపెనీ నష్టాల్లో ఉంటే లాభాల బాట పట్టించడానికి నా సాయం కోరాడు. కంపెనీకి ఇంచార్జ్ చేశాడు. కంపనీ వ్యవహారాలూ చూసుకోవడానికి నాకు 'కొన్ని' అధికారాలు ఇచ్చాడే తప్ప, నాకూ కంపెనీ కి ఎటువంటి సంబంధం లేదు... నేను ఆ కంపెనీలో ఆనందరావు గారి పి.ఎ. మాత్రమే!"
అప్పుడు గుర్తొచ్చింది ఆనందరావుకు. రిజి స్ట్రేషన్ ఆ ఫీసులో ఆ రోజు జరిగిన సంఘటనలు. ఆ రోజు చాలా డాక్కు మెంట్స్ పై సంతకాలు చేశాడు. అప్పుడే డౌట్ వచ్చింది ఆనందరావుకు.
"ఇన్ని డాక్కు మెంట్లా!" అని రిజి స్ట్రార్ ఆఫీసు వాళ్ళ ను అడిగాడు. వాళ్ళు దానికి సమాధానంగా ,"రూల్స్ మారాయి...ఫార్మాలిటీస్" అన్నారు. శేఖర్ కూడా అవునన్నాడు. నమ్మించాడు.
అంటే డబ్బులతో రిజి స్ట్రార్ ఆఫీసు వాళ్ళను, శేఖర్ ను మేనేజ్ చేశాడు. బ్యాoకు డాక్కు మెంట్ల పైనా, కంపెనీ ఇంచార్జ్ ఫైల్స్ మీద సంతకాలు తీసుకున్నాడు. తనపేరు మీదే అప్పులు చేసి, తన కంపెనీ నడుపుతున్నాడు. లావా దేవీలన్నీ తన మీద చేస్తున్నాడు. కంపెనీ లో జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు భాధ్యలు..." తలుచుకోగానే ఆనంద రావు వెన్నులో వణుకు పుట్టింది.
కానీ ఆరోజు విజయ్ అలా ఆలోచించలేదు.
శిరీష ఆనంద రావు ఏకైక కూతురు! ఆస్తి తనపేరు మీద వున్నా, ఆనందర రావు పేరు మీద ఉన్నా ఒకటే అనుకున్నాడు. కానీ అదికూడా ఇలా కలిసి వచ్చినందుకు సంబర పడిపోయాడు!
సిబిఐ లాయర్ తన మాటల్ని కొనసాగించాడు. "యువరానర్! ముద్దాయి చాలా తెలివైన వాడు. అతనికి చాలా మంది బినామీలు ఉన్నారు. వారికి తమ కంపెనీలో చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వాళ్ళు ఇవేమీ తెలియక సాధారణ ఉద్యోగులుగా బ్రతుకు తున్నారు! దేశంలో ఇలాగే చాలా మంది ఉన్నారు. ఫ్యాక్షన్ లీడర్ల దగ్గర , పారిశ్రామిక వేత్తల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర...పనిచేసే వాళ్ళ మీద కోటాను కోట్ల ఆస్తులుంటాయి...వాళ్ళ దగ్గర రహష్యం గా రాయించుకున్న అగ్రిమెంట్ల మూలంగా వాళ్ళు సాధారణ జీవితం గడుపుతునారు. రెండు పూటలా తిండి లేక బ్రతికే పాలేర్ల మీద కోట్లు ఆస్తులుంటాయి. సరిగ్గా అలాంటి 'ట్రిక్' ప్రయోగించి ఇతను వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు...."
డిఫెన్స్ లాయర్ జ్యోతి అడ్డు తగిలింది.
"యువరానర్! లాయర్ గారు కథలు అల్లడంలో దిట్ట! సినిమాలలో కథలకు కొంచెం డిమాండ్ ఉంది. అక్కడ ట్రై చేస్తే బెటర్ లేదా ఫిక్షన్ కథలు రాయొచ్చు! అంతేకాని ఏ ఆధారం లేకుండా నా క్లయింట్ ను రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. మీరు ఓ సారి నా క్లయింట్ ను ఎగ్జామిన్ చేయడానికి అనుమతి ఇవ్వ వలసిందిగా విన్న వించు కుంటున్నాను..."
"అబ్జె క్షన్ " అన్నాడు సిబి ఐ లాయర్ రమేష్.
"నా క్లయింట్ మంచివాడని నిరూపించడానికి అవకాశం అడగడంలో తప్పేముంది..."
"అబ్జె క్షన్ ఓవర్ రూల్డ్..."
14th and 15th parts amazing. This novel is boost for TDP
ReplyDelete