Saturday, April 27, 2013

రూలర్ సినిమాకథ-09


"... అలాంటిదేమీలేదు. నువ్వంటే నాకిష్టం. ఇష్టం కాదు ప్రాణం! కానీ నాకొక ఆశయం ఉంది. అది సాధించాలనే పట్టుదలతో కష్టపడుతున్నాను. అందుకే ఇప్పుడే పెళ్లి వద్దను కుంటున్నాను. అంతే గానీ మరే ఉద్దేశ్యంగానీ, ఆలోచన గానీ లేదు. ఇది నిజం. నన్ననమ్ము!".
"మరి అలా అయితే నీ ఆశయమేదో చెప్పొచ్చు కదా !"
"అది ఇప్పుడు చెప్పే విషయం కాదు. దానికి ఇంకా కష్టపడాలి. సంపాదించాలి. టైం వచ్చి నప్పుడు చెబుతా. అంతవరకు దాన్ని గురించి నన్నేమీ అడగకు. ప్లీజ్!"
"ఇంకెంత  సంపాదించాలి?ఇప్పుడే ఎన్నో కాలేజీలు స్థాపించావు.హాస్పిటల్స్ కట్టించావు. వందల సంఖ్యలో లారీలు కొన్నవని జనం చెప్పుకుంటున్నారు. అది చాలదా?".
"సరిపోదు. నా ఆశయం పెద్దది. ఇంకా ఇంకా శ్రమించాలి. సంపాదించాలి".
"అంత డబ్బెలా సంపాదిస్తావు?".
"అది టాప్ సీక్రెట్. సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నేనే చెడుతా. అంత వరకు నన్నడగకు."
"అయితే ఒక్కటి మాత్రం నిజం. నిన్ను జనం మెచ్చు కుంటు న్నారు. పేదలకు ఉచితంగా విద్య, తక్కువ ఖర్చుతో  వైద్యం అందిస్తున్నా వని. అందుకు నీకు అభినందనలు..."
మాటలకు ఎగతాళి చేస్తున్నట్లు చిన్న గా నవ్వాడు.
అమ్మాయి చిత్రంగా అతని వైపు చూసింది.
"ఎవరు చెప్పారు నీకు నేను ప్రజా సేవ చేస్తున్నానని! అంతా బూటకం. అబద్ధం. పేద పిల్లలంటే ఎవరు? మా దగ్గర చదివే వాళ్ళలో ఎక్కువ మంది వెనుకబడిన తరగతులవారు. వారికి ప్రభుత్వం స్కాలర్ షిప్ లు  ఇస్తుంది. హాస్టల్ కు సరిపడా సోమ్ములిస్తోంది. అంటే వారి డబ్బుతో వారే చదువు తున్నారు. ఇది నిజం. అయితే సంగతి వారికి తెలియదు...నేనేదో ఊరికే నా డబ్బుతో చెప్పిస్తున్నాని అనుకుంటున్నారు. ఇకపోతే వైద్యం ఇది కూడా కాస్త ఖరీదైనది. డాక్టర్లకు నేను జీతం ఇస్తున్నాను. కాబట్టి వారు మా హాస్పటల్లో పది రూపాయలకే వైద్యం చేస్తున్నారు. అసలు  విషయాన్ని దాచి పెట్టి దేశ విదేశాలలో ప్రచారం చేస్తూ డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాను. ఇకపోతే జాగ్రత్త గా గమనించు.
  హాస్పిటల్ చుట్టూ ఉన్న మెడికల్ షాప్ లన్నీ నావే! పది రూపాయలు ఫీజు తీసు కునే డాక్టర్లు రాసే మందులు మాత్రం చాలా ఖరీదైనవి! జబ్బు కు ధనిక,పేద తేడా లేదు. ఎంతైనా ఖర్చు చేస్తారు. ఇది వాళ్ళ వీక్ నెస్. చివరకు నేను డాక్టర్లకు ఇచ్చే జీతం కూడా మందుల కమీషన్ పై ఆధారపడి ఉంటుంది. ఇది తెలియని ప్రజలు నన్ను దేవుడం  టున్నారు! నా జేబునుండి ఒక్కరూపాయి కుడా ఖర్చు పెట్టకుండా సంపాదిస్తున్నాను."
"ఎంతటి మోసం?"అప్రయత్నం గా  అంది.
"త్వరగా డబ్బు లు సంపాదించాలంటే ఇలాంటివి చెయ్యాలికదా !"
"అలాగని ప్రజల జీవితాలతో ఆడుకుంటావా?"
"నేనెవర్నీ బలవంతం పెట్టలేదు. ఇక తప్పేముంది!"
"ప్రజల బలహీనతలు ఆసరా చేసుకుని డబ్బులు,పేరు ప్రతిష్టలు  సంపాదిస్తున్నావుతన మోసాల్ని కూడా సమర్ధించు కునే నీలాంటి మోసగాడిని ఏమనాలి? ఏం చెయ్యాలి...?" అంటూ విజయ్ ను తిడుతున్న అమ్మాయికి , కొద్ది దూరంలో తన స్నేహితు రాళ్ళతో కలిసి వెళుతున్న 'లత' కన్పించింది.
"లతా...లతా" అని పిలుస్తూ వవడిగా అడుగులు వేసుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళింది.
తన పేరుపెట్టి ఎవరు పిలిచినా ఠక్కున వినిపిస్తుంది. అదే ప్రతిఒక్కరికి తన పేరు పై ఉన్న మమకారం!
అలా తనకోసం వస్తున్నా శిరీషను చూసి ఆగిపోయింది. ఆమె తో పాటే ఆమె స్నేహితు రాళ్ళు కూడా ఆగారు.
"ఏమీటీ ఇలా...సర్ ప్రైజ్!" అంది శిరీష లత తో .
'ఫ్రెండ్స్   తో వచ్చాను' అని తనతో వచ్చిన   ఫ్రెండ్స్ ను పరిచయం చేసింది లత. వాళ్ళు మాటిమాటికీ వాచీ చూసుకుం  టున్నారు.
"నువ్వేమిటీ  ఇలా వచ్చావ్!" లత అడిగింది.
విజయ్ తో వచ్చాను.
అప్పటివరకు వాచీలు చూసుకుంటున్న వాళ్ళు కూడా ఆసక్తిగా చూశారు. ఎదుటి వాళ్ళ ప్రేమ, గాసిప్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా!
"ఉండు. పరిచయం చేస్తాను" అని విజయ్ కోసం చూసింది.
******
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (C.B.I)
న్యూ ఢిల్లీ.
మీటింగ్ రూం లో అగుడు పెట్టాడు సి. బి. . డైరెక్టర్. అప్పటికే అతనికోసం ఎదురు చూస్తున్నారు జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ కమీషనర్లు.
సరిగ్గా అప్పుడే డైరెక్టర్ రెడ్ పైల్ ఓపెన్ చేశాడు. అందరూ ఆశ్చర్యం గా చూశారు ఆయన్ని కాదు. పైల్ ని!
డిపార్ట్ మెంట్ లో పదిహేను దాకా రెడ్ పైల్స్ ఉంటాయి!
క్రెమ్ స్టాయిని బట్టి రక రకాల పైల్స్ ను తయారు చేస్తారు సి బి పోలీసులురెడ్, బ్లూ, గ్రీన్, యెల్లో, బ్లాక్, ఆరెంజ్, పర్పుల్...కలర్స్లో ఉంటాయి పైల్స్దేశానికి  అత్యంత ప్రమాద కరమైన, పెద్ద పెద్ద వాళ్ళుగా చలామణి అవుతున్న పేరొందిన నేరగాళ్లకు మాత్రమే రెడ్ పైల్ ఉపయోగించడం జరుగు తుంది.
"ఇంత కాలానికి మళ్ళీ రెడ్ పైల్...ఎవరా వ్యక్తీ!"
"హాయ్ డియర్స్! " సి బి డైరెక్టర్ చెప్పడం ప్రారంభించాడు. ఆఫీసర్లంతా షాక్ నుండి తేరుకోలేదు! ఆయన చేతిలో ఉన్న రెడ్ పైల్ నే చూస్తున్నారు!
"మీరెప్పుడైనా శిరీష ఇండ స్ట్రీ స్ యజమాని విజయ్ పేరు విన్నారా? అతడ్ని చూశారా? .." సి బి డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. గుసగుసలు బయల్దేరాయి. తాము మీటింగ్ హాల్లో ఉన్నామనే సంగతి మర్చిపోయి మాట్లాడుకుంటున్నారు.
శబ్దాన్ని భగ్నం చేస్తూ డైరెక్టర్ చెప్పాడు. అతను . పీ  లో ఇండ స్ట్రీ లిస్ట్. అతను మూడేళ్ళ క్రితం సాధారణ ఉద్యోగి. నెల జీతం తో ఎలా బ్రతకాలి అని లెక్కలు వేసుకుని బ్రతికే మద్య తరగతి వ్యక్తి!.
కానీ ఇప్పుడు ... అని ఒక్క క్షణం ఆగి,అందరూ తన మాటలు వింటున్నారని గుర్తించి కొనసాగించాడు.
వేల కోట్లకు అధిపతి! అతని చేతిలో విద్యా లయాలు, హాస్పటల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న లారీలలో పాతిక శాతం అతనివే! ఒకవేళ జరగా రానిది ఏదైనా జరిగితే ధరల పరిస్థితి ఏమౌతుందో ఆలోచించండి...
ఇంత డబ్బు సంపాదించడానికి అతనికి పట్టిన సమయం ఐదేళ్ళు! ఐదే ఐదేళ్ళలో వేల కోట్లు సంపాదించాడు. రాజకీయాల్లో, వ్యాపారాల్లో అతనికి బంధువులు లేరు. మరెలా సంపాదించాడు. అంతా రహస్యం!!
గదిలో కలకలం రేగింది. సి బి ఆఫీస్ అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుకుంటున్నారు.
సి బి డైరెక్టర్ స్వరం కొనసాగింది.
"అతను తన సంపాదనలో కొంత ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు! ఉచిత విద్య అందిస్తున్నాడు. తక్కువ ఖర్చుతో వైద్య సేవలు చేస్తున్నాడు. ప్రజలలో మంచి పేరుంది. పెద్ద మనిషిలా చలామణి అవుతున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్త గా ఉండాలి. లేకపోతే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది".
"ఎం క్వయరీనా?' ఆఫీసర్ సందేహంగా అడిగాడు.
అక్కడున్న వారందరి చూపులు పైల్ మీదే ఉన్నాయి. దాన్ని గ్రహించాడు డైరెక్టర్.
"మీ అనుమానం నాకర్థమైంది! నేను కూడా అతనిపై బ్లూ పైల్ తయారుచేయాలా లేక రెడ్ పైల్ తయారు చేయాలా అని ఆలోచించాను. చివరకు రెడ్ పైల్ తయారు చేశాను. దానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది  ఐదేళ్ళలో వేల కోట్లు సంపాదించడం అంటే మాటలు కాదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, రౌడీలు, స్మగ్లర్లు... కూడాఅంత సంపాదించ లేరు! ఇకపోతే రెండవది అతను మంచితనం తో కొంత పేదలకు ఖర్చు పెడుతున్నాడు. దానిపై రాష్ట్ర ముఖ్య మంత్రి భయపడుతున్నాడు! అతను రాజ కీయాల్లో వస్తాడా  లేక పారిశ్రామిక వేత్తగా ఉంటాడా ...అన్న సందేహాన్ని పార్టీ హై కమాండ్  దృష్టికి తెచ్చాడు. సెంట్రల్లో ఉన్నది వాళ్ళ పార్టీయే కదా! రాజు తలచుకుంటే దెబ్బలకు కొదువ లేదన్నట్లు మనకు వెంటనే దర్యాప్తు చేయమని ఆదేశాలు అందాయి...అంటే రకంగా మన దర్యాప్తు సమాజానికే కాదుకొందరికి  రాజకీయ ప్రయోజనాలన్న మాట!"
వింటున్న వాళ్ళు ఒక్క క్షణం ఉలిక్కి  పడ్డారు . రాజ కీయ నాయకులు ఎంత తెలివైన వారు. ఎంత ముందు  చూపుతో  ఆలోచిస్తారుఎంత నెట్ వర్క్ ఉంటుంది . ముందుగానే వాళ్లకు సపోర్ట్ చేసే వ్యక్తుల గురించి ఆలోచనకు వచ్చేస్తారు. ఇలా దర్యాప్తు సంస్థలను  అదుపులో పెట్టుకుని సహాయం కోరతారు. వినక పొతే భయపెడతారు. ఎంతకీ దారికి రాకపోతే వాళ్ళ మీద 'రైడ్' చేయిస్తారు. ఎంతటి దుర్మార్గపు ఆలోచన..."అక్కడున్న వాళ్ళ మదిలో రకరకాల ఆలోచనలు.
వాళ్ళు అలా ఆలోచనలో ఉండగానే సి బి డైరెక్టర్ తన మాటల్ని కోన సాగించాడు.
" కేసును మన జాయింట్ డైరెక్టర్ ప్రకాష్ కు అప్పగిస్తున్నాను! అతనికి రోజు నుండి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అతనికి ఏదైనా అవసరైమైన ప్పుడు మనమందరం సహాయ పడాలి. ఆపరేషన్ మాత్రం చాలా సీక్రెట్ గా జరగాలి..."
అక్కడున్న వాళ్ళందరూ అలా తిరిగి సి బి జె డి ప్రకాష్ వైపు చూశారు. 'కంగ్రాట్స్' చెప్పారు.
*****
సరిగ్గా అప్పుడే సముద్రం అలలో ఆడుకుంటున్న పిల్లవాడు 'గవ్వ' ను విసిరి వేశాడు. అది విజయ్ దగ్గర పడింది. దాన్ని తీసుకుని పిల్ల వాడి దగ్గరకు వెళ్ళాడు.
"విజయ్.. విజయ్..."అన్న శిరీష పిలుపులు సముద్రపు అలల శబ్దం తో కలిసి పోయాయి.
"సర్లే. తరువాత కలుద్దాం. టైం అయ్యింది. ఇంటి దగ్గర మానాన్న వెయిట్ చేస్తుంటాడు. లేటుగా వెళ్తే కారణాలు చెప్పాలి".
'సరే 'నంది శిరీష ఇక చేసేదేమీ లేక.
శిరీష అప్పుడు అక్కడ విజయ్ ను లత కు పరిచయం చేసి వుంటే, ఆమె విజయ్ గురించి శిరీషకు చెప్పుంటే ఇన్ని అపార్థాలు, అనర్ధాలు జరిగి ఉండేవి కాదేమో! పైగా విజయ్ మీద గౌరం కలిగేది. అలా జరగా లేదు. అంతా రాత!
అలా స్నేహితులతో మాట్లాడి తిరిగి వచ్చింది శిరీష.
"మా స్నేహితురాలికి పరిచయం చేద్దామనుకున్నాను. పిలిచాను. పలకలేదు. అలా దూరంగా ఉన్నావు. వాళ్ళు ఇంటికి త్వరగా వెళ్లాలని వెళ్ళిపోయారు..."
"పర్లేదులే. తరువాత ఎప్పుడైనా కలువొచ్చు!"
తనూ అలాగే అంది.

1 comment:

మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు