"
ఆ ఇల్లే.. చాలా మంచివాడు. ఏడాది నుండి ప్రేమిస్తున్నాను.అయితే వన్ సైడు మాత్రమే... ఆ వైపు నుండి మాట గాని, చిన్న సైగ గానీ లేదు..."
"నీ ముఖం! అతనెవరో తెలుసా.. శిరీష ఇం డ స్ట్రీస్ ఎం. డి..."
" అంటే... విజయ్ గారు... మీ..."అర్దోక్తిగా ఆపుచేసింది.
అవునన్నట్లు తలాడించింది శిరీష.
"నేను నమ్మలేక పోతున్నాను... ఆయన ఇక్కడ... ఇలా..."అని తన ఆశ్చర్యాన్ని కంటిన్యూ చేసింది.
అంతలో అక్కడనుంచి విజయ్ బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వీళ్ళను చూడ్లేదు. శిరీష కూడా అతడ్ని పలకరించలేదు. ఆపే ప్రయత్నమూ చేయలేదు. అతను అలా వెళ్ళగానే అతను ఉన్న ఇంటికి బయలుదేరింది.
ఇంటి డోర్ లాక్ చేసి ఉంది.
"రాయి తీసుకో తాళం కప్పు పగుల గొ డదాం..."అంది శిరీష.
"వద్దొద్దు...తాళం చెవి ఇక్కడో ఎక్కడో పెట్టుంటాడు... మామూలుగా అయితే తలుపు మీద పెడతాడు..."అంటూ అలా తలుపు మీద తడిమి "దొరికింది..." అంది లత.
"బాగానే అబ్జర్వ్ చేస్తున్నావే!" అంది కొంటెగా.
కొంచెం సిగ్గుపడుతూ,"పో...శిరీషా... " అంటూ తాళం తెరిచింది.
శిరీష ఇంట్లోకి అడుగు పెట్టింది. పెద్ద హాలులా ఉంది. ఒకటే గది. ఓ ప్రక్క కిరోసిన్ స్టవ్. కొన్ని వంట పాత్రలు. మొరొక ప్రక్క కొన్ని పేపర్లు, ఫైల్స్! ఓ చోట తను రాసిన కవిత గోడకు వ్రేలాడుతోంది...తను డిగ్రీ చదివేటప్పుడు తన క్లాస్ మేట్స్ రూమ్స్ గుర్తుకు వచ్చాయి శిరీషకు! ఇలాంటి షీట్స్ ఇంటిలో ఎందుకున్నాడబ్బా అనుకుంటూ పేపర్ల దగ్గరకు వెళ్ళింది. ఏవో రీసెర్చ్ పేపర్లు లా ఉన్నాయి అని వాటిని అందుకోబోయి, ఆ ప్రక్కనే కనపడిన డైరీ తీసుకుంది.
డైరీ పైన ఉన్న ఇయర్ చూసి గత ఏడాది డైరీ. అయినా కొత్తది లా ఉంది...అనుకుంటూ డైరీ ఓపెన్ చేసింది.
ముత్యాల్లాంటి అక్షరాలతో రాసిన మాటలు చదివింది.
"శిరీషా! డైరీ రాసే అలవాటు నాకు లేదు. ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన దాన్ని ఇన్నాళ్ళు వాడలేదు. ఆ అవసరం రాలేదు. నన్నెవరు ఏమైనా అన్నా విన్నాను.పట్టించుకోలేదు. నా ప్రాణానికి ప్రాణమైన నీవు చిన్న మాట అనినా తట్టుకోలేక పోతున్నాను. నీ తో చెప్పుకోలేని మాటల్ని ఇందు లో రాస్తే నా బాధకు కొంతైనా ఉపశమనం కలుగుతుందని రాస్తున్నాను..ఆ రోజు అనాధ అనీ, తల్లి దండ్రుల ప్రేమానురాగాలు తెలియవని తిట్టావు. మనం కర్మ సిద్దాంతం నమ్ముతాము. తల్లిదండ్రులను ఆరాధిస్తాం. పూజిస్తాం. కన్న కొడుకు కోసం తల్లి తన గుండెను కోసి ఇచ్చిందన్న కథను చదివాం. విన్నాం. అలాగే ఈదేశంలో తల్లిదండ్రులను కావడిలో మోస్తూ తీర్థ యాత్రలు చేయించే శరవణుడు లాంటి పుత్రులున్నారు. నిస్వార్ధంగా పోషించే బిడ్డలున్నారు. నేను సుమారు ఆరొందల మంది చేత ఫీడ్ బ్యాక్ తీసుకున్నాను. ఎనభై శాతం మంది తల్లిదండ్రులకు అపోజిట్ గా రాసిన వారే! డబ్బున్న వాళ్ళు కూడా తమ పెళ్ళిళ్ళను పెద్ద వాళ్ళు స్టేటస్ సింబల్ గా, ఆస్తుల్ని పెంచుకోవ డానికి తమ పెళ్ళిళ్ళను ఉపయోగించు కుంటున్నారని రాశాను. నా ఉద్దేశ్యం పెద్ద వాళ్ళంతా చెడ్డ వాళ్ళు కాదు బిడ్డలంతా తల్లిదండ్రులను గెంటెసే ద్రోహులు కారు. నువ్వు నాకు 'ప్రేమాను బంధాలు' తెలియవని అన్నావు. అన్నీ దగ్గర్నుంచి చూశాను... నేను అనాధను. కానీ ఆఫీలింగ్ నాకెప్పుడూ కలుగ లేదు! ఇప్పుడు నాకు నువ్వున్నావు. అంతే చాలు. నా ‘ప్రాణం’ నన్నేమైనా అంటే నేనెలా తట్టుకోగలను! నువ్వు డబ్బు మనిషివి అని తిడుతున్నప్పుడు నేనెంత నరకం అనుభావించానో తెలుసా! మాటల్లో చెప్పలేను. నా ఆశయం కోసం నేను కొన్ని కఠిన మైన నిర్ణయాలు తీసుకున్నాను. త్వరలో నా ఆశయం నెరవేర బోతోంది. ఆరోజు నాకున్న ఆస్తులన్నీ పేదలకు పంచేస్తాను.అప్పుడు నీ దగ్గ రకు వచ్చేస్తాను.నా ఆశయం నెరవేరే వరకు నీ 'ప్రేమ' ను పొందలేను! నీవు అనుమానంగా చూసే చూపు, మాటలు నన్ను బాధించినా నా ఆశయం కోసం ఓర్చుకోవాలి. తప్పదు. భరించాలి... ఇంకొన్ని రోజులే...అంత వరకు నన్ను క్షమించు ప్రియా !"
డైరీ చదువుతున్నంత సేపూ ఆమెకు దుఃఖం ఆగలేదు. శిరీష ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాక అలాగే చూస్తుంది పోయింది లత.
"లతా! నేను అర్జెంటు గా విజయ్ ను కలవాలి. చూడాలి. మాట్లాడాలి. పద..పోదాం పద..."అంది శిరీష.
లత సరేనంది.
శిరీష నడుపుతున్న బైక్ ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. ఆమె ఆలోచనలు అంతకంటే వేగంగా వెళుతున్నాయి. విజయ్ గురించి ఆలోచిస్తోంది. ఆమె మదిలో పాత జ్ఞాపకాలు మెదిలాయి. విజయ్ లంచ్ బాక్స్ లో చాలా సార్లు పెరుగన్నం చూసింది! ధరించే దుస్తులు బ్రాండెడ్ వి కావు... అప్పుడంతగా పట్టించు కోలేదు. కానీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి...అతని సింప్లిసిటీ! ఎందుకలా... ఆమె మదిలో రకరకాల ఆలోచనలు.
అంతలో బైక్ కు కుక్క అడ్డం వచ్చింది. దాన్ని తప్పించబోయింది. అటువైపు వస్తున్న కారును చూసుకోలేదు!
పెను ప్రమాదం జరిగింది.
వేగంగా వస్తున్నా కారును 'ఢీ'కొట్టేసరికి శిరీషకు తీవ్ర గాయాలయ్యాయి.
శిరీష సృహ కోల్పోయింది. అపస్మారక స్థితిలో కి వెళ్ళిపోయింది. వెనకాల ఉన్న లతకు అంతగా దెబ్బలు తగల్లేదు. సృహ ఉంది. "హెల్ప్...హెల్ప్..."అని అరుస్తోంది.
జనం గుమికూడారు. కొందరు యాక్సి డెంట్ జరగానే అంబులెన్స్ కు ఫోన్ చేసారు. వాటర్ బాటిళ్ళతో నీళ్ళు తెచ్చారు. కారు డ్రైవర్ కు దేహశుద్ది చేశారు!
అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా ప్రవేట్ వెహికల్స్ ఆపి,అందులో హాస్పిటల్ కు తీసుకెళ్ళారు స్టానికులు.
డాక్టర్లు ఎక్సరే లు, రకరకాల పరీక్షలు చేశారు. చివరకు " తలకు బలంగా గాయం అయ్యింది.కుడికాలు మ్రొకాలు క్రింది భాగాన ఎముక విరిగింది. ప్రాణాలకు భయం లేదు.విరిగిన ఎముకకు ఇనుపరాడ్ల తో కట్టు కట్టాలి...త్వరగా కోలుకుంటుంది. నడవడానికి ఆర్నెల్లు పడుతుంది. కనీసం మూడ్నెల్ల యినా బెడ్ రెస్ట్ కావలి..."అన్నారు డాక్టర్లు.
*****
ఖాతా దారులకు ధనాన్ని రుణంగా తీసుకోవటం, ఇవ్వటం బ్యాంకు యొక్క ప్రధాన కార్య కలాపాలు.
ఖాతాదారుల చేత తక్కువ వడ్డీకి తీసుకుని అవసరమైన వారికి లోన్స్ ఇస్తూ వచ్చే రాబడి పై బ్రతికే సంస్థ. చెక్కులు, డ్రాప్ట్ లు , కమీషన్లు...పై వచ్చే ఆదాయం కంటే వడ్డీ మీద వచ్చే ఆదాయం ఎక్కువ !
కష్ట మర్లందరికీ ఒకేసారి డబ్బు అవసరం రాదు. విత్ డ్రా చెయ్యరు... అనే నమ్మకం మీద బ్యాంకులు పని చేస్తాయి. ఒకవేళ అలా జరిగితే బ్యాంకులు దివాలా తీస్తాయి. ఇది నిజం. వాస్తవం!
విజయ్ అదే 'ట్రిక్' ను ప్రయోగించాడు.
వివిధ బ్యాంకులలో వివిధ ప్రదేశాలలో విజయ్ బినామీలు డబ్బులను విత్ డ్రా చేశారు. బ్యాకులలో ఉన్న సొమ్మంతా వెళ్లాకే ఇచ్చేశారు! మిగిలిన ఖాతాదారులకు 'హెడ్ ఆఫీసు' నుండి తెచ్చి ఇస్తామన్నారు! అయితే అది భయం వలనో, కమ్యూని కేషన్ గ్యాప్ వలనో తెలియదు గానీ తెలిసిన వారికి తెలిసినట్టు చెప్పారు బ్యాంకులో డబ్బులేదని... అయిపోయిందని....
ఒకరినుండి మరొకరికి ' వార్త ' రకరకాలుగా వెళుతోంది. విన్నవారు ఇంకొకరితో ఫలానా బ్యాంక్ లో డబ్బు ఖాళీ అన్నారు...అది విన్న వారు యూరప్ సంక్షోభం గురించి చెప్పి, బ్యాంకు లలో డబ్బు ఉంచడం శ్రేయస్కరం కాదన్నారు! దాన్ని విన్న వారు బ్యాంకులలో డబ్బు ఉంచవద్దని చెప్పారు. ఆ వార్తలు దావానలంలా వ్యాపించాయి. డానికి టెక్నాలజీ పెరిగింది.
సెల్ ఫోన్స్ బిజీ అయ్యాయి.
బ్యాంకు తన రుణాలను ఖాతాదారుల సొమ్మును చెల్లించ లేనపుడు దివాలా తీస్తుంది. అది రెండు రకాలు. ఒకటి స్వచ్చందంగా. రెండవది తప్పనిసరిగా. దాన్ని నిర్ణయించేది మాత్రం డైరెక్టర్లు.
బ్యాంకుల ముందు, ఎ.టి.యం ల ముందు జనం బారులు తీరారు. పెట్రోలు ధర పెరుగుదల అనౌన్స్ చేసినప్పుడు పెట్రోల్ బ్యాంకుల దగ్గర ఉండే 'క్యూ' లా పెద్ద పెద్ద 'క్యూ'లు ఏర్పడ్డాయి.
ఎ.టి.యం లో డబ్బులు అయిపోయాయి. కలకలం రేగింది. అభద్రతా పెరిగింది. విచక్షణ కోల్పోయారు. దాడులకు దిగారు.
నిరంతరం సంచలన వార్తలకోసం పరితపించే లెక్కకు మించి ఉన్న వార్తా చానెళ్ళ కు 'పని' దొరికింది. విజృo భించారు. చూపించిన దృశ్యాన్ని, ప్రదేశాన్ని మళ్ళీ మళ్ళీ చూపించి ప్రజలలో గందర గోళాన్ని, భయాన్ని పెంచారు.
క్షణాల్లో ఆ వార్త ప్రపంచం నలుమూలలా వెళ్ళింది.
బ్యాంకులు సంక్షోభం బాట పడ్డాయి. దాని ప్రభావం మొదట స్టాక్ మార్కెట్లపై పడింది. బ్యాంక్ సూచీలు నష్టాలు చూపించాయి. దాని ప్రభావం మిగతా వాటి పై పడి మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు లోనయ్యాయి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల సైతం ఖంగు తున్నారు! అమ్మకాలు జోరందుకున్నాయి. దీంతో బి ఎస్ ఇ సెన్సెక్స్ పన్నెండు వందల పాయింట్లు దిగువున ట్రేడ్ అవుతోంది. నిప్టీ 430 పాయింట్లు నష్టపోయింది.
సెన్సెక్స్ 6.17 శాతం, నిప్టీ 6.89 శాతం చొప్పున క్షీణించాయి. నష్టం సుమారు నాలుగు లక్షల కోట్లుగా అంచనా వేశారు !
సి.ఎం. కార్యాలయంలో మంత్రులతో ముఖ్యమంత్రి అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సి ఎం , హోం మంత్రి, వివిధ శాఖ మంత్రులు సుమారు 20 మంది సమావేశానికి హాజరయ్యారు. సమీక్షా సమావేశానికి వివిధ ఇంటలిజెన్స్ విభాగాల అధిపతులు కూడా హాజరయ్యారు. వారిలో సిబి ఐ జెడి ప్రకాష్ కూడా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి , విచారణ పురోగతి పై చర్చించారు. సిబిఐ జెడి తన నివేదికను సమర్పించాడు.
"ఇలా జరగడానికి కారణం విజయ్. ఒకేసారి అన్ని బ్యాంకులలో డబ్బు విత్ డ్రా చేయించి, ఇలాంటి సంఘటనలకు ,పరిస్థితి కి కారణం అయ్యాడు. అతనికి బినామే ఆస్తులున్నాయి. మోసాలు చేస్తున్నాడు. ఆర్ధిక నేరాలు చేశాడు. వాటన్నింటికి ఆధారాలున్నాయి! అతడ్ని అలా వదిలేస్తే దేశ భవిషత్, భద్రత దెబ్బతింటాయి. .." నివేదకను మత్రిమండలి చర్చించింది. తాజా పరిణామాలను అధిష్టానానికి తెలియజేశారు.
అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
మంత్రులు మాట్లాడారు.
"ప్రజలకు ఏమీ భయం లేదు. మీ డబ్బులు ఎక్కడికీ వెళ్ళవు. ప్రభుత్వం గ్యారంటీ! కావాలని ఈ రూమర్లు క్రియేట్ చేశారు. దోషుల్ని పట్టుకున్నాం. విచారిస్తున్నాం! త్వరలో అరెస్ట్ చేస్తాం...."
మంత్రులు ఎంత ధైర్యం చెప్పినా ప్రజలలో భయం తొలగలేదు.
మరికొన్ని గంటల్లోనే విజయ్ ను అరెస్ట్ చేయాలని సిబిఐ కి ఆ దేశాలు వచ్చాయి. విజయ్ ను అరెస్ట్ చేసేందుకు సిద్దమైంది.
ప్రాధమికంగా బ్యాంకులనుండి బినామీలతో డబ్బు విత్ డ్రా చేయించి ప్రజల్ని భయాందోళన లకు గురిచేశాడని అభియోగాలు మోపింది. అతని సిబిఐ పలు సెక్షన్ల కింద కేసు నమోదు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు