Saturday, April 27, 2013

రూలర్ సినిమాకథ-10


"నన్ను ఏమని పరిచయం చేస్తావు. స్నేహితుడనా, ప్రియుడనా,మోసగాడనా, డబ్బు పిచ్చోడనా..."

"ఎవరైనా ప్రియుడి గురిచి ఇతరుల ముందు చెడుగా చెబుతారా..?'
"హమ్మయ్య! నామీద నా ప్రియులాలికి కొంత కోపం తగ్గింది. అంతే చాలు. నీ కోపం చూసి రోజు నేను ఎడం వైపు లేచానేమోనని అనుమానం కలిగింది!" అన్నాడు.
  ఆమాటలకు ఆమె నవ్వేసింది. తిరిగి నవ్వింది. అందంగా నవ్వింది.
దృశ్యం మనోహరంగా ఉంది.

"మా స్నేహితురాలు లత చాలా మంచిది. మధ్య తరగతి అమ్మాయి..."
ఆమాటలకు అతను మౌనంగా ఉండి వుంటే సరిపోయేది.కానీ అతను అలా ఉండలేదు.
"అవునా?" అన్నాడు.
"అవును. పాపం పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రెండేళ్ళ నుండి వెతుకుతున్నా మంచి సంబంధం దొరకలేదు".
"అమ్మాయి అందంగా ఉండదా!"
"చాలా బావుంటుంది".
"అయితే పెళ్ళెందుకు కాలేదు! ఇప్పుడు అమ్మాయిలకు మంచి డిమాండ్ ఉంది. అందులో అందమైన అమ్మాయిలకు డబ్బులు ఎదురిచ్చి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు!" అన్నాడు కొంటెగా చూస్తూ.
"నిజమే అనుకో! మంచోళ్ళు దొరకద్దూ..."
ఆమాటలకు చిన్నగా నవ్వి అన్నాడు. "రెండేళ్ళు వెతికినా దొరకలేదా? ఆమె ఉద్యోగం చేస్తోందా? వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు?".
"ఆయనేమీ చెయ్యడు! అమ్మాయికి  MNC  కంపెనీలో మంచి జాబ్".
"అదీ సంగతీ! తనకూతురికి పెళ్లి చేస్తే ఆర్థికంగా ఇబ్బందని అతను నెట్టుకొస్తున్నాడేమో!"
శిరీష కోపంగా అతని వైపు చూసింది. "ఎంత దారుణంగా ఆలోచిస్తున్నావు. కన్నా తల్లిదండ్రులైనా తమ పిల్లల గురించి అలా ఆలోచిస్తారా..."
"ఎందుకలా అనుకుంటున్నావు? తమ బిడ్డలా సంపాదనతో బ్రతికే తల్లి దండ్రులు, అన్న దమ్ములు, అక్కా చెల్లెళ్ళు... చాలా మంది ఇలా ఆలోచిస్తున్నారు. ఇది నమ్మలేని పచ్చి నిజం!"
అమ్మాయి కోపం తారా స్థాయికి చేరింది.
"ఎంత నీచంగా మాట్లాడు తున్నావు. మానవ సంబంధాలు గురించి నీకు తెలుసా? ఎలా తెలుస్తాయి. అనాధవి కదాతల్లిదండ్రుల, అక్క చెల్లెళ్ళ, బంధువుల... ప్రేమాను రాగాలు నీకెలా  తెలుస్తాయి. ఇన్నాళ్ళు నీకు డబ్బు పిచ్చే అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నీకు ప్రేమానురాగాలు కూడా లేవని!"
అతను దెబ్బ తిన్నట్లు అలా శిరీష వైపు చూశాడు.
"అయినా నీదేం తప్పులేదులే! అనాధవి కదా! ఎవరో కానీ పారేస్తే, చెత్త కుప్పలో ఉన్నది తిని పెరిగిన నీకు మమతాను రాగాల గురించేమి తెలిస్తుంది. తల్లిదండ్రులను ఇలా నీచంగా మాట్లాడే నిన్ను ప్రేమిచడం నాదే బుద్ది తక్కువ!..." అనేసి అక్కడ్నుచి వడివడిగా వెళ్ళిపోయింది.
అతను నిర్ఘాంతపోయి అలాగే చూస్తుండి పోయాడు.
*****
సిబిఐ జెడి ప్రకాష్ చాంబర్ లోకి అడుగు పెట్టాడు సి బి ఇనస్పెక్టర్ అనంత శర్మ.
ఏదో రాసుకుంటున్నప్రకాష్ ఆగి, అనంత శర్మ వైపు చూశాడు.
తన పైల్ మీద సంతకం కోసం వచ్చాడు. అలా ముందుకు వంగి పైల్ అందించాడు. పైల్ తీసుకుంటూ అనంత శర్మ వైపు చూశాడు.
చెంప వాచిపోయి ఉంది. దాన్ని చూశాడు.
"ఏమైంది... చెంప ఎందుకలా ఉంది?" తెలుసుకోవాలని అడిగాడు.
ఆతరువాత పరిశీలనగా చూశాడు. చేతి వ్రేళ్ళ గుర్తున్నాయి. ఎవరో కొట్టినట్లు ఉన్నారు అనుకున్నాడు.
"ఏం..ఏంలేదు!" అన్నాడు తడబడుతూ.
"పర్లేదు చెప్పు. పర్సనల్ అయితే వద్దు. జస్ట్ తెలుసుకోవాలని అడుగు తున్నాను".
అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న దుఃఖాన్ని ఆపుకో లేక ఏడుస్తూ చెప్పాడు.
"ముఖ్యమంత్రి కొడుకు సురేష్ కొట్టాడు".
"వ్వాట్! సురేష్ కొట్టాడా? ఎందుకు?"
ముఖ్యమంత్రి కొడుకు సరదాలకు  అంతులేదు ! అతను స్నేహితుల తో కల్సి జల్సా చేస్తుంటాడు! ఖరీదైన బైక్ లలో ఊరంతా బలాదూర్ తిరుగుతుంటాడు. కొన్ని  కంపెనీల  బైక్ లు ఫాతిక   లక్షల కంటే ఎక్కవే! అలాంటి బైక్ పైన  చేత్తో బీర్ బాటిల్ తాగుతూ, మరో చేత్తో డ్రైవింగ్ చేస్తూ ఫ్రెండ్స్ తో కల్సి వస్తున్నాడు సురేష్. అలా కొద్ది దూరం రాగానే బాటిల్ ఖాళీ అయ్యింది. చేతిలో ఉన్న బాటిల్ ను దూరంగా విసిరి వేశాడు. మద్యం మత్తులో ఉన్నాడు. తల పొగరు. దారిలో ఉన్న అమ్మాయిల దగ్గరకు బైక్ పోనిచ్చి సడెన్ గా  హారన్  కొట్టేవాడు.వాళ్ళు ఉలిక్కి పడేవారు. దాన్ని చూసి థ్రిల్లయ్యె  వాడు .వాడి శాడిజం మూలంగా చాలా మంది భయపడేవారు. అలా వాడు శాడిస్టిక్ ఆనందం పొందేవాడు.
నా భార్య కూతురుతో కల్సి గుడికి వెళ్లి తిరిగి వస్తున్నాం. రోడ్డుపైన నేనూ నా భార్య ముందు నడుస్తున్నాం. వెనకాలే మా అమ్మాయి వస్తోంది. అమ్మాయి చేతిలో పూజ తట్ట వుంది.
సురేష్ అలా బైక్ మీద వస్తూ మా అమ్మాయి నడుం క్రింది భాగాన 'టచ్' చేశాడు. మా అమ్మాయి కోపంతో 'ఇడియట్!' అంది.
అత ను సడెన్ బ్రేక్ తో బైక్ ఆపాడు. రివర్స్ చేసి మా అమ్మాయి దగ్గర కు  వచ్చాడు. అతని వెనకాలే అతని ఫ్రెండ్స్ ఉన్నారు. దాంతో అతను మరింత రెచ్చిపోయాడు!
"ఏయ్! ఏంటే అన్నావ్" అన్నాడు మా అమ్మాయితో.
"నా కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశం తో అతని షార్ట్ పట్టుకున్నాను. సి బి  ఇనస్పెక్టర్ కూతుర్నే అల్లరి చేస్తావా?" అన్నాను కోపంగా.
అతడు షేం గా ఫీల్ అయ్యాడు.
బైక్ నుండి అలా జంప్ చేశాడు. 'ఫట్' మని నా చెంప పగుల కొట్టాడు. "నువ్వు ఆప్ట్రాల్ సి బి ఇనస్పెక్టర్. నేనెవరో తెలుసా..! సి. ఎం. కొడుకు."
అంతే భయం వేసింది నాకు. వెంటనే కొద్ది దూరం జరిగాను. అంతలో అక్కడికి జనం చేరారు. ఎవరో మొబైల్ తీశారు.అతని ఫ్రెండ్స్ బలవంతంగా అతడ్ని బ్రతిమాలుతూ పిలుచుకెల్లారు..."
"అతని పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా?"
"లేద్సార్'.
"ఎందుకూ?"
"అంత పెద్ద వాళ్ళతో గొడవ మనకెందుకు సర్!".
"వ్వాట్! ఒక సి బి ఇనస్పెక్టర్ ఇలా మాట్లాడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమి?"
"అందంతా నాకు తెలియదు సర్. పోలీసులై నంత మాత్రాన మనం రాగ ద్వేషాలకు అతీతులం కాదు. మనకూ భార్యా పిల్లలు ఉన్నారు. బ్రతకాలి..."
"అయితే తప్పు చేసిన వాళ్ళను వదిలేద్దామా!".
వారిపైన పోరాడి మనమేం సాధిస్తాం. అనవసరమైన పంతాలకు పోయి ఉద్యోగాలు పోగొట్టు కోవడం కంటే ఇలా ఉండటం  మేలు...”
"అంటే..." అని ఏదో చెప్ప బోతున్న విజయ్ సెల్ మ్రోగింది.
"హలో..."అన్నాడు.
"హలో... నేను మీ భార్యను మాట్లాడుతున్నాను ".
"శ్రీ కళ్యాణీ! నేను కొద్ది బిజీగా ఉన్నాను. తరువాత..."అతని మాటలు పూర్తి కాకుండానే ఆమె అడ్డు తగిలింది.
"ఏవండీ! మన బాబును ఎవరో కిడ్నాప్ చేశారు" అంది ఏడుపుతో.
" కిడ్నాప్ చేశారా... ..ఎవరు...?"
"తెలియదు. పనిమనిషి రంగయ్యతో ఐస్ క్రీమ్ కావాలని షాప్ కు వెళ్ళాడు. షాప్ దగ్గర ఎవరో కార్లో వచ్చి తీసుకెళ్ళారు..."
"ఎవరైనా ఫోన్ చేశారా?"
"లేదు".
"సరే. కంగారుపడకు. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను..."అంటూ చక చక బయలుదేరి ఇంటికెళ్ళాడు.
శ్రీక ళ్యాని ఫోనులో మాట్లాడుతోంది. అక్కడే ప్రక్కన రంగయ్య నిలబడి ఉన్నాడు. అతని ముఖం దిగులుతో ఉంది.
ప్రకాష్ ను చూడగానే బోరున విలపించింది. "మన అబ్బాయిని విజయ్ మనుషులు కిడ్నాప్ చేశారట! అతని మీద మీరు తయారు చేసిన ఫైల్ ను అతనికి ఇస్తే వదిలి పెడతారంట. అంతేకాదు. అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు..."
అప్పుడర్థం అయ్యింది అతనికి ఎవరు కిడ్నాప్ చేశారో!
" ఫైల్ అతనికి ఇచ్చేసి, మన బిడ్డను తీసుకోచ్చేయండి..."
"వ్వాట్! నేను రాత్రీ పగలు కస్టపడి, సాక్షాధారాలతో తయారుచేసిన ఫైల్ ఇచ్చెయ్యాలా...మన స్వార్ధం కోసం నా సిన్సియారిటీ కోల్పోవాలా?"
"అదంతా నాకు తెలియదు. నాకు నా బిడ్డ ముఖ్యం. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాడికేమైనా జరగరానిది జరిగితే నేను తట్టుకోలేను. ప్రాణాలతో ఉండలేను..."
విజయ్ ఆలోచిస్తున్నాడు. "ఆఫీసులో అతను అధికారానికి భయపడి కేసు పెట్టనన్నాడు. ఇప్పుడు ఈమె రౌడీలకు భయపడి ఫైల్ ఇచ్చెయ్యమం టో oది. ఎటుపోతోంది నాదేశం..."

అంతలో అక్కడికి బాబు ని తీసుకుని విజయ్ వచ్చాడు.
శ్రీ కల్యాణి ని చూడగానే విజయ్ నుండి  క్రిందకు దిగి తల్లి దగ్గరకు వెళ్ళాడు. వాడ్ని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది ఆమె. తడి కళ్ళతో కృతజ్ఞతతో విజయ్ వైపు చూసింది. తల్లి ప్రేమను గుర్తించాడు.
తరువాత ప్రకాష్ వైపు తిరిగి అన్నాడు."నమస్తే సర్ నాపేరు విజయ్."
"తెలుసు. ఫోటోలో చూశాను" అన్నాడు సిబి జెడి ప్రకాష్.
ఆమె విస్తుపోయి చూసింది. అతడ్ని, తన భర్తను మార్చి  మార్చి  

2 comments:

మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు