Saturday, April 27, 2013

రూలర్ సినిమాకథ-02


నవ్వు ప్రతిపక్షం వాళ్ళను గేలిచేసేటట్లున్నా . నవ్వుల్లో జీవంలేదని ఎమ్మెల్యే ముఖ కదలికల్ని చూసిన వారు గ్రహించారు. అయితే దాన్ని వాళ్లు వ్యక్తం చేయలేదు.
ఎమ్మెల్యే తన నవ్వును కంటిన్యూ చేస్తూనే అన్నాడు. "ప్రస్తుతానికి ప్రతిపక్షానికి కొంత పేరున్న మాట వాస్తవమే. అయినా పార్టీ ఎన్నికల్లో గెలవదు!
ఎమ్మెల్యే కోతల రాయుడు . తనకు అనుకూలంగా ఎన్ని మాటలైనా మాట్లాడుతాడని తెలిసినా సందేహం నటిస్తూ అడిగాడు కోటయ్య,"అంత కాన్పిడెంట్ గా ఎలా చెప్పగలరు?!"

ఎమ్మెల్యే చెప్పబోయే సమాధానం కోసం ధర్మారావు,కోటయ్య ఆత్రుతతో  ఎదురు చూడసాగారు.వారి అనుమానం తొలగించడానికి ఎమ్మెల్యే చెప్పడం ప్రారంభించాడు. అయితే మాటలు తన తలరాతను మారుస్తాయని గ్రహించలేక పోయాడు!

రెండు మూడు సినిమాలు చూసి ప్రేమంటే తనకు పూర్తిగా తెలుసునుకొని పెద్దల్ని ఎదురించే ఇంటర్మీడియట్ అమ్మాయిలా, ఎమ్మెల్యే రాజకీయాల గురించి మాట్లాడుతుంటాడు.తన బాస్ చెప్పేవి అపద్దాలు తెలిసినా, అతనికి భయపడి పొగిడే ఉద్యోగిలా వీళ్ళు  ఎమ్మెల్యే మాటలకు భజన చేస్తుంటారు.అయితే ఈసారి సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ గా ఉండడంతో కొంచెం శ్రద్ధగా వింటున్నారు.

"మన ముఖ్యమంత్రి చాలా తెలివైన వాడు. తప్పకుండా మళ్ళీ మన పార్టీని రూలింగ్ లోకి తెప్పిస్తాడు. మన పార్టీ పై ఉన్న మమకారంతో కొన్ని చోట్ల ప్రజలు మనకే ఓటు వేస్తారు. కుల పిచ్చి అధికంగా ఉన్న ప్రాంతాలకుకులం వారికి సీట్లుస్తాం! నెలరోజులుండగానే మాస్ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని భారీ మొత్తం డబ్బు పంపిణీ చేస్తాం.ఈసారి వాళ్ళ వాళ్ళ మతం ఆధారంగా హిందువుల దగ్గరికెళ్ళి భగవద్గీత మీద, క్రిస్టియన్ల వద్దకు వెళ్ళి బైబిల్ పైన,ముస్లింల చెంతకు చేరి ఖురాన్ మీద... ప్రమాణం చేయించుకుంటాం. చచ్చినట్లు మనకే ఓట్లు వేస్తారు. సాధారణంగా సర్వే ఫలితాలు మాస్ మీద ఆధారపడి ఉంటుంది.డబ్బులిచ్చి నేషనల్ మీడియా ని కూడా మేనేజ్ చేస్తాం! మన పార్టీ వీక్ గా ఉన్న చోట్ల అవినీతి ఆఫీసర్లను ట్రాన్స్ ఫర్ చేయిస్తాం. రిగ్గింగ్ చేయిస్తాం. మందు, డబ్బుతో ..." అని చెప్పుకు పోతున్న ఎమ్మేల్యే మాటలు మద్యలోనే ఆగిపోయాయి.

 అంతవరకు ఎమ్మేల్యే నోటి వెంట వెలువడుతున్న మాటలు హఠాత్తుగా మద్య లోనే ఆగిపోవడంతో ఎమ్మేల్యే ముఖం వైపు చూసి, తరువాత ఆయన చూస్తున్న కిటికీ వైపు చూశాడు ధర్మారావు,కోటయ్యలు. అంతే వాళ్ళ మద్యం మత్తు కూడా పూర్తి గా వదిలిపోయింది.

స్థాణువులా అలాగే చూస్తుండిపోయాడు. ఎమ్మెల్యే రాయన్న కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.

"ఒరేయ్! ఎవరో మనమాటల్ని వీడియో తీస్తున్నారు. వెళ్లి పట్టుకొండ్రా...వెళ్ళండి". అంటూ అరిచాడు. ఎమ్మెల్యే అనుచరులు సైనికుల్లా ముందుకు కదిలారు. వాళ్ళకంటే ఎమ్మెల్యే మాటల్ని ముందుగా రిసీవ్ చేసుకున్న శిరీష తప్పించుకోవడానికి ప్రయత్నిచింది. గోడపైకి నిచ్చెన సాయంతో వెళ్ళికిటీకీ గుండా  వీడియో తీస్తున్న ఆమె, నిచ్చెన దిగడం ఆలస్యం అవుతుందని గ్రహించి పై నుండి జంప్ చేసి, పరుగులు తీసింది.
కెమారాను జాగ్రత్తగా ఓచేత్తో పట్టుకొని పరుగెత్తుతోంది. ఆఅమ్మాయిని ని ఎమ్మెల్యే అనుచరులు వెంబడిస్తున్నారు. మెయిన్ గేటు దగ్గరకు వెళ్తే ప్రమాదమనీ, ఇలాంటి ఆపదలు ఎదురైతే ఎలా తప్పించుకోవాలో ముందే ప్లాన్ ప్రకం వచ్చింది కాబట్టి, ఎక్కువ టైమ్ వేస్ట్ చెయ్యకుండా గెస్ట్ హౌస్ వెనుక భాగం వైపు వెళ్ళింది. ప్రహరి గోడ  ఎక్కి అవతల ఉన్న రోడ్డుమీదకు జంప్ చేసింది. అనుచరులు కూడా ఆమెను ఫాలో అయ్యారు.

భయంతో జోరుగా పరుగెత్తుతోంది. ఎమ్మెల్యే అనుచరులు ఎలాగైనా ఆమెను పట్టుకోవాలని పట్టుదలతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పరుగులుతీస్తున్నారు. వెంబడిస్తున్నారు. కొంతమంది షార్ట్ కట్ లో వెళ్ళరు. మరికొంతమంది ఆమెను వెంబడిస్తున్నారు. అందరూ రోడ్లవెంట పరుగులు తీస్తున్నారు.

 ఆమె "హెల్ప్...హెల్ప్!" అంటూ అరుస్తోంది.

షార్ట్ కట్ లో వెళ్ళిన వాళ్ళు ఆమెకు ఎదురొచ్చారు!. శిరీష భయపడి పరుగెత్తడం ఆపేసింది. ఫాలో అయిన వాళ్ళుకూడా దగ్గరకు వచ్చి నిలబడ్డారు. క్షణంలో వాళ్ళంతా ఆమెను సెంటర్ చేసారు. పులలమద్యలో లేడికూనలా ఉంది. భయంతో వణికిపోయింది. ఆదృశ్యం చుసిన పక్షులు ఆకాశంలో వింతగా అరుచుకుంటూ దూరంగా వెళ్ళిపోయాయి.


అంతలో కారు  అటువేపు రావడం చూసి కొంత దైర్యం తెచ్చుకుని, గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. ఆమె అరుపులు బయటకు రాకముందే చేత్తో ఆమె నోటిని మూసేసి, గట్టిగా పట్టుకున్నాడు ఒకడు. ప్రక్కనే ఉన్న చెట్ల దగ్గరకు లాక్కెళ్ళారు. చేత్తో కెమారాను పట్టుకుని, మరోచేత్తో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. గింజు కుంటోంది.

వేగంగా కారు నడుపుతున్న విజయ్ లైట్ల వెలుగులో చెట్లదగ్గర మనుషులు కన్పించేసరికి కొద్దిగా కారు స్లో చేసాడు. అక్కడున్న వాళ్ళను చూసి జరగకూడనిది ఏదో జరుగుతుందని గ్రహించి కారుని ఆపేసాడు. క్రిందకు దిగాడు. వాళ్ళను చూశాడు.

వాళ్ళుకు విజయ్ ను చూసే సరికి కోపం కట్టలు తెంచుకుంది. "ఎవడ్రానువ్వు! ఏరియాకి కొత్తా...మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో ... ప్రాణాలతో బయట పడతావు ...లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..." హెచ్చరించారు.
విజయ్ వాళ్ళ మాటలకు సమాధానం చెప్పకుండా ప్యాంటు జేబులో ఉన్న మొబైల్ తీసాడు! వాళ్ళ మాటల్ని వీడియో తీస్తున్నాడు. వాళ్ళు కొద్దిగా భయపడ్డారు. అయినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు.
"ఏయ్! ఎవర్నువ్వు... మర్యాదగా అడిగిన ప్రశ్నకు మర్యాదగా సమాధానం చెప్పడం తెలియదానీకు? మేం ఎవ్వరిమో తెలుసానీకు?"

“తెలుసు” అన్నాడు విజయ్.

ఒక్కక్షణం వాళ్ళు అయోమయంతో ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. క్షణం సేపే వెంటనే తేరుకున్నారు.
" మేం ఎమ్మెల్యే మనుషులని తెలిసి కూడా మాకు అడ్డువస్తున్నావా ! ఎంత పొగరునీకు? ప్రాణాలమీద ఆశ ఉంటే ఇక్కడ్నుంచి పారిపో..."అన్నారు.


"మీకు నేనెవరినో తెలియదు. అసిస్టెంట్  కమిషనర్  ఆఫ్ పోలీస్ ని. మీ ఫోటోలు, వీడియోలు...ఇక్కడ జరుగుతున్నదంతా పోలీస్ స్టేషన్లో ఉన్న కంప్యూటర్లలో ఫీడ్ అయిపోతున్నాయి. మర్యాదగా ఆమె ను వదిలేసి  వెళ్ళిపొండి. లేకపోతే జైల్లో ఊచలు లెక్క  పెట్టాల్సివస్తుంది.మీ పెళ్ళాం పిల్లల సంగతి ఆలోచించండి".
" మాతోపెట్టుకుంటే మా ఎమ్మెల్యే మిమ్మల్ని వదిలిపెట్టరు!..." కొంచెం ధైర్యం తెచ్చుకుని చివరి అస్త్రంగా ప్రయోగించారు.
" ఆమె ను వదిలేసి వెళ్ళిపోండి. తరువాత నేనొచ్చి ఎమ్మెల్యే సర్ తో మాట్లాడతాను. లేకపోతే ఇక్కడ జరిగేవన్నీ స్టేషన్లో ఉన్న కంప్యూటర్లలో ఫీడ్ అవుతున్నాయి. అరెస్ట్  అయితే  మీరు బెయిల్ పైన విడుదలవ్వాలిఆతరువాత మిమ్మల్ని ఎమ్మెల్యే కాదుకదా దేవుడు  కుడా కాపాడ లేడు. వెళ్ళండి... ఇక్కడ్నుచి  పారిపోండి..."భయపెట్టాడు.

వాళ్ళు భయంతో ఆమెను వదిలేసి పారిపోయారు.

విజయ్ కారు డోర్ తెరిచాడు. ఆమె కార్లో కూర్చుంది. కారువేగంగా వెళ్తోంది. కాసేపు తరువాత ఆమె వైపు చూశాడు. అదే క్షణం ఆమె కూడా చూసింది. వెంటనే అతను దృష్టి మరల్చి డ్రైవింగ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మద్య కాసేపు నిశ్యబ్దం రాజ్యం చేసింది. తరువాత ఆమె తన సందేహాన్ని వ్యక్తం చేసింది.

" మీరు .సి.పి.నా ...? ఎప్పుడొచ్చారు సిటీకి...?"
అతను చిన్నగా నవ్వి అన్నాడు."నేను  పొలీసాఫీసర్నికాదు. సిటీ కాలేజ్ లో లెక్చురర్ని. వాళ్ళను భయపెట్టడానికి అపద్దం చెప్పాను".

అతని తెలివి తేటల్ని మనసులోనే మెచ్చుకుంది.

ఆమెకు ఆసమయంలో కుడా నవ్వొచింది. కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిచి, ఆపుకోలేక చిన్నగా నవ్వింది. ఆమె నవ్వు చూసి తను కుడా నవ్వాడు. ఆమెవైపు చూశాడు. తన గురించి అడుగు తున్నాడని గ్రహించి చెప్పింది.

"నేను జర్నలిస్ట్ ని".

"విలేకరా!" అన్నాడు ఆశ్యర్యంగా.
"అంత ఆశ్యర్యపోతా రేమిటండీ! నిజంగా నేను విలేకరిని. ఈమాట మా ఇంటిలో కుడా తెలియదు. అది వేరేసంగతీ. నేను ప్రముఖ వ్యాపారవేత్త ఆనందరావు కూతుర్ని!..."
అతడు ఆమె వైపు చిత్రంగా చూశాడు. తను చెప్పడం శ్రద్ధగా వింటున్నాడని గ్రహించి మరింత ఉత్సాహంగా చెప్పడం ప్రారంభించింది.
రోజు సరదాగా స్నేహితులతో కల్సి ఇంటర్వ్యూకు వెళ్ళను. నేను సెలక్ట్ అయ్యాను. పార్ట్ టైం జాబ్ కాబట్టి సరదాగా కొద్ది రోజులు చేద్దాంలే అనుకున్నాను మొదట్లో. తరువాత నేను తీసిన ఫోటోలు, రాసిన వార్తలు మరుసటి రోజు పత్రికలో వస్తుంటే ,అందరూ వాటిని ఇంట్రెస్టింగా  చదువు తూంటే  చాలా సంతోషం కలిగేదిచాలా క్రొత్త క్రొత్త విషయాలు తెలిసేవి. సంతోషం, తృప్తి మనిషికి కావలసిన వాటిలో ముఖ్యమైనవిఆరెండూ ఉద్యోగంలో నాకు పుష్కలంగా లభించేవి. అప్పుడప్పుడు అవినీతిని బయటపెట్టి, నా శక్తి కొద్దీ మంచిని కాపాడుతున్నాను. సమాజానికి మేలు చేస్తున్నాను. అలా మన ఎమ్మెల్యే చేయబోయే అక్రమాల్ని వీడియో తీస్తుంటే ...వాళ్ళకు దొరికిపోయాను. ఆయన అనుచరులే వాళ్ళు..."అంటూ అర్దోక్తిగా ఆపు చేసింది.

తను చేసిన పనిని గర్వంగా ఫీల్ అయ్యింది. చెప్పింది. అతనివైపు చూసింది. తన మాటల వలన అతని ముఖంలో ఎటువంటీ మార్పు లేకపోవడంతో కాస్త అశ్యర్యపోయింది! తను చేసిన పనికి మెచ్చు కుంటాడని, అభినం దిస్తాడనీ ఊహించిన ఆమె అహం దెబ్బ తిన్నది.

"మీరు అధికార పక్షానికి వ్యతిరేకమా?..." అని అడిగాడు.

ఆమె మరింత ఆశర్యపోతూ, "వ్వాట్?" అంది.
అతను ఆమెవైపు చూడకుండా చెప్పాడు.

ఈవార్త వలన మీరు సాధిం చేది ఏది? ఎవరికీ లాభం. ఇలాంటి వార్తలు మీరు ఇలా, మేము ఇలా అని తిట్టుకోవడానికి ఉపయోగపడతాయి .చానెళ్ళవరికి న్యూస్! లీడర్లకి కొద్దిరోజులు టైం పాస్. మాలాంటివారికి  కాస్త ఎంటర్ టైన్ మెంట్ ...దేశంలో చాలా మంచి వార్తలున్నాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చాలా ఇళ్ళు కట్టించాడట. గత ముఖ్యమంత్రి ఐదు ఏళ్ళలో 40లక్షలు ఇళ్ళు, ముందు ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ళలో పదిహేను లక్షలు ఇళ్ళు కట్టించానన్నాడు. మరి మన రాష్ట్రంలో సగానికి పైగా గుడిసెలున్నాయి. మిగతా సగంలో చాలా వరకు సొంతంగా నిర్మించుకున్నవే! మరి ఈలేక్కలేమిటీ! పెరిగిపోతున్న నిరుద్యోగులగురించీ, అద్దెల గురించీ, ధరల గురించీ రాయొచ్చుగా ...
"అంటే న్యూస్ వలన ఉపయోగం లేదా? మేము వాటిని రాయలేదా?"
“ఉంది. ఎప్పుడో ఒకప్పుడు అలాంటివి లోపలి పేజీల్లో రాస్తారు. రాజకీయాలగురించి మాత్రం ఫుల్ గా రాస్తారు. అందులో చాలా వరకు ఉపయోగంలేనివే! ఉదాహరణకు రాజకీయనాయకులను ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళ అక్రమాలపైన, రౌడీ ఇజం పైన, అన్యాయాల మీద  రకరకాల ప్రశ్నలు వేస్తారు. ప్రేక్షకులు నిజం అని నమ్ముతారు. చానెళ్ళను ఉపయోగించుకుని రాజకీయనాయకులు తమపైన వచ్చిన ఆరోపణలకు తెలివిగా వివరణ ఇచ్చుకుంటారు. తప్పించుకుంటారు ! టీవీ రేటింగ్ పెరగడంతో ఎడిటర్లు సంతృప్తి పడతారు. అందరి ప్రయోజనాలు నెరవేరుతాయి. చివరకు మోసపోయేది మాత్రం ప్రజలే!
ఆమె నోటివెంట మాట రానట్లు అతనివైపు చూస్తూ ఉండి పోయింది. అతని మాటలు ఆమెను మంత్రం వేసినట్లు కట్టి పడేశాయి.
*****
సెల్ ఫోన్ తీసుకున్నాడు విజయ్.
"హలో హనుమంత్ ! పోలీసులు ఇంకా పాప ఆచూకి తెలుపలేదు. సారి స్టేషన్ కు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఏమైంది కనుక్కుని రా!..." అన్నాడు స్నేహితునితో.
"నేనిప్పుడే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. పాప ఆచూకి దొరికింది. ఈరోజు పేపర్లో యాడ్ వేసారు. పాప ప్రముఖ లాయర్ జ్యోతి గారి కూతురు.పేపర్ చూడు."

'ఏమిటీ పాప లాయర్ జ్యోతి గారి కూతురా! టాప్ టెన్ లాయర్లలో ఒకరైన జ్యోతి గారి కూతురా..." మరింత ఆశ్యర్యంగా కన్ఫర్మ్ కోసం మళ్ళీ అడిగాడు.
అవునని చెప్పాడు హనుమంత్.
"సరే. నేను పాపను తీసుకు జ్యోతి గారింటికి వస్తాను. నీవు అటునుంచి అటే వాళ్ళింటికి వచ్చేసేయ్ ."

సరేనన్నాడు హనుమంత్.

1 comment:

  1. ఇది పొలిటికల్ స్టొరీ. పాలిటిక్స్ ఇష్టపడే వారికి నచ్చే స్టోరీ.

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు