Saturday, April 27, 2013

రూలర్ సినిమాకథ-07


"రూల్స్ సంగతి నాక్కూడా తెలుసు. అయితే అంత మొత్తం 'లోన్' తీసుకున్నానే సంగతి నీకూ, నాకూ తప్ప మరెవ్వరికీ తెలియదు! ఒకవేళ తెలుసున్నా, అది 'ఫ్రూవ్' చేయడానికి సమయం పడుతుంది. లోపల నేనే తిరిగి ఇచ్చేస్తాను..."అని చెప్పుకు పోతున్న విజయ్ మాటలకు అడ్డు తగిలాడు  మేనేజర్.
"రూల్స్ గురించి మీకు అంతగా తెలియదు! చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. అలా చేస్తే మా ఉద్యోగాలు పోతాయ్! మేం జైలు పాలు అవ్వాల్సి వస్తుంది".
చాలా సేపట్నుంచి ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాడిలా చెప్పడం ప్రారంభించాడు విజయ్.
"బ్యాంకులకు ఎగనామం పెట్టిన సంస్థలు చాలా ఉన్నాయి. హర్షద్ మెహతా సంస్థ 812 కోట్లు, రాజిందర్ సంస్థ  382 కోట్లుముఖేష్ గుప్తా 587 కోట్లు... ఎగవేత దారులనుండి బ్యాంకు లకు సుమారు లక్ష్యా యాబై వేల కోట్ల మేరకు అప్పులున్నాయి. 2010 నాటికి లెక్కల  ప్రకారం బకాయిల వసూల ట్రిబ్యునల్ల దగ్గర రూ. 90,110 కోట్ల విలువైన 33,595 కేసులు పెండింగ్ లో ఉన్నాయి....అన్నాడు. అతను తను చెప్పేది బాగా వింటున్నాడని కన్ఫర్మ్ చేసుకున్నాక మళ్ళీ కొనసాగించాడు.
మంత్రం వేసినట్లు ఆశ్చర్యం గా వింటున్నాడు మేనేజర్. విజయ్ నోటివెంట వెలువడుతున్న గణాంకాల సైతం అతడ్ని ఆశ్చర్యం తో ముంచెత్తు తున్నాయి!
"వ్యవస్థ లోని లొసుగుల ఆధారంగా చేసుకుని పెద్ద పెద్ద మోత్తాలతో రుణాలను ఎగవేయడం పెద్ద పెద్ద సంస్థలకు పరిపాటిగా మారి పోయింది. రాజ కీయ నాయకులు తమ పలుకు బడిని ఉప యోగించి తమకు కావలసిన కంపెనీలకు బ్యాంకులు, ఫైనాన్షియల్ కార్పోరేషన్ల నుండి భారీ మొత్తాలలో రుణాలు మంజూరు చేసుకోవడం, అవి వాటిని తిరిగి చేల్లిస్తున్నాయో లేదో పట్టించుకోక పోవడం మామూలే. మన దేశంలో కొన్ని బ్యాంకులు ఖాయిలా పడడానికి ఇటు వంటి బకాయి దారులే కారణమవడం సత్య దూరం కాదు. బ్యాంకులు కూడా సాధారణ రుణగ్రస్తుల  నుంచి బకాయిలను ముక్కు పిండి వసూలు చేస్తాయి. అదే బడా సంస్థలు విషయం వచ్చే సరికి చేతు లు ఎత్తేస్తాయనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నదే! ఋణం ఎగవేసిన వ్యక్తీ తన సంస్థకు భారీ నష్టాలు వచ్చాయని ప్రకటించి చేతులు దులిపేసుకోవచ్చు. ఖాయిలా పడిన పరిశ్రమలు కంపెనీల చట్టం లోని  నిబంధనలను అనుసరించి పారిశ్రామిక, ఆర్ధిక పునర్నిమాన బోర్డు రక్షణను కోరవచ్చు. ఒకవేళ వారిని రుణాల వసూల త్రిబునళ్ళకు లాగినా, రుణ వేత దారు వీలైనంత జాప్యం చేసే ఎత్తుగడలను అనుసరించి రుణదాతలను మూడు చెరువుల నీళ్ళు తాగించవచ్చు".

విజయ్ చెప్పడం పూర్తయినా మేనేజర్ నోరు మెదపక అలాగే ఉండిపోయాడు!
"మీరు తలచుకుంటే నాకు అప్పు ఇవ్వడం పెద్ద కష్టం కాదు! ఆలోచించండి. మీరు చేసిన సహాయానికి 'తగిన' ప్రతిఫలం ఉంటుంది." బేరం పెట్టాడు.
"లోన్ ఇవ్వొచ్చు గానీ..." అర్దోక్తి గా ఆపుచేశాడు మేనేజర్.
"మీకేం భయం లేదు! నాకు పొలిటికల్ పవర్ ఉంది. మీకు అనుమానం ఉంటే చెప్పండి. ఎమ్మెల్యే తో మాట్లాడిస్తాను".
"మీమీద  నమ్మకం ఉంది. నాకు ఇస్తామన్న కమీషన్..."అంటూ నసిగాడు.
"మీకు సంశయం అక్కర్లేదు. లోన్ ఇచ్చేటప్పుడు మీ కమీషన్ తీసుకుని మిగిలినది ఇవ్వండి".
అతను సరే నన్నాడు.
*****
'పోస్ట్' అంటూ కేక వేశాడు పోస్ట్ మేన్. పిలుపు వినగానే గేటు దగ్గరకు తూనీగలా వెళ్ళింది శిరీష. అతను ఇచ్చిన కాగితం మీత సంతకం పెట్టి తనకు వచ్చిన కవర్ తీసుకుంది. పోస్ట్ మేన్ వెళ్ళిపోయాడు. తిరిగి ఇంట్లోకి వస్తూ ఫ్రం అడ్రస్ చూసింది. పత్రికాఫీసు అడ్రస్ ఉంది. ఏదో శుభ వార్త ఉంటుందని మనసుకు అన్పించింది. సంతోషం పరవళ్ళు త్రోక్కింది. కవర్ విప్పాలనే ఆతృతతో త్వర త్వరగా విప్పింది. తన కళ్ళను తానే నమ్మలేక  పోయింది.
"కవితల పోటీలో ప్రధమ బహుమతి!"
వార్తను చదివింది. మళ్ళీ చదివింది. తనివితీరా చదివింది. ఆనందంతో ఎగిరి గంతులేసింది. అలాగే బెడ్ మీద పడుకుంది. ఉత్తరాన్ని తన గుండెలకు హత్తుకుంది. అంత సంతోషంలో కూడా అమ్మాయికి  విజయ్ గుర్తొచ్చాడు.
'విజయ్' నేనొక కవిత రాశాను. ప్రధమ బహుమతి వచ్చిందని అతనికి చెప్పాలిఅది వినగానే తన కవితను మెచ్చు కోవాలి. తన వైపు ఆరాధన గా చూడాలి. ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలి . తను సిగ్గు పడుతూ వద్దొద్దు... అనాలి. అతను 'ప్లీజ్!' అంటూ బ్రతిమలాడాలి... అలా కలలు కంటోందివాటిని భగ్నం చేస్తూ ఆనం దరావు గొంతు విన్పించింది.
"శిరీష! అక్కడేం చేస్తున్నావు. ఇలారా".
తన తండ్రి ఏదైనా ముఖ్యమైన పని ఉంటే తప్ప అలా అరిచి రమ్మని చెప్పాడు. పిలుపు హాల్లో నుండి విన్పించిందని గ్రహించి హాల్లోకి పరుగున వచ్చిందిఅక్కడ సోఫా లో కుర్చుని ఉన్నాడు ఆనందరావు . అతని భార్య కూడా అక్కడే నిల్చొని ఉంది. అతని ముఖంలో కోపం, అవమానం కొట్టొచ్చినట్లు కన్పిస్తున్నాయి. శిరీష సంతోషమంతా గాల్లో కలిసి పోయింది.
"విజయ్ నీ కెంత కాలంగా తెల్సు?"
ప్రశ్న ఆనంద రావు నోటివెంట వెలువడు తుందని  అమ్మాయి ఊహించలేదు. అనుకోని ప్రశ్న అలా సడెన్ గా అడిగే సరికి బిత్తరపోయింది. భయ పడిపోయింది. క్షణంలో  ఏం చెప్పాలో  ఆమెకు అర్థం కాలేదు. తెలుసు, తెలియదన్నట్లు తలూపింది.
"ఇప్పుడు అతడి గురించి డాడీ ఎందుకు అడిగాడు? అతని గురించి డాడీ కి మైనా తెలిసిందా ? విజయ్ ఇప్పుడెక్క డున్నాడు? ఏం చేస్తున్నాడు?...."అని ఆలోచిస్తున్న శిరీషకు ఆనందరావు మాటలతో సమాధానం దొరికింది.
"వాడు సాధారణ లెక్చరర్! కానీ రోజు నా ఫ్యాక్టరీ కొన్నాడు. వాడికి అంత డబ్బెక్కడిది! ఎవరిచ్చారు. ఎలా సాధ్యం?"
"ఏమిటీ! విజయ్ మన ఫ్యాక్టరీ కొన్నాడా? మీరు చెప్పేది నమ్మ శక్యం కాకున్నది. నిజమా   డాడీ!" మరింత ఆశ్చర్యం గా అడిగింది.
అమ్మాయి మాటలతో మరింత కడుపు మంటతో రగిలి పోయాడు. అతని చేతి వ్రేళ్ళు బిగుసుకున్నాయి. ఊపిరి బిగ పట్టాడు! కోపంగా శిరీష వైపు చూశాడు. అమ్మాయి ముఖంలో అలాగే ఉన్న ఆశ్చర్యాన్ని చూశాడు! తరువాత మనసు మార్చుకున్నాడు. "అవునన్నట్లు" తలూపాడు. కోపంతో బిగ పట్టిన గాలిని నోటి ద్వారా 'తుస్సు' మంటూ వదిలాడు.
"నిన్నటిదాకా హుందాగా ఉన్నతను ప్రస్తుతం సర్వం కోల్పోయిన రారాజులా ఉన్నాడు! చే జారిన ఫ్యాక్టరీని తలచుకుని దుఃఖం , అవమానం తో రగిలి పోతున్నాడు. అతడి బాధ వర్ణనాతీతం! అలా మౌనంగా కుర్చుని ఉన్నాడు. అతని ప్రక్కనే శిరీష తల్లి కూడా నిల్చొని ఉంది.
అప్పుడక్కడ వాళ్ళందరి మద్య మౌనమే రాజ్యం చేసింది.
*****
శిరీష  ఇండస్ట్రీస్  ప్రొప్రయిటర్ సీట్లో కుర్చుని వీక్లీ చూస్తున్నాడు విజయ్. అందులో శిరీష రాసిన కవిత ఉంది. దాన్ని అతను తనివి తీరా చదువుతున్నాడు.
సరిగ్గా అప్పుడే డోర్ తెరచుకుని లోనికి వచ్చింది శిరీష.
అమ్మాయిని చూడగానే ఆశ్చర్యం, సంతోషం ఒకేసారి కలిగాయి. వీక్లీ ప్రక్కన పడేశాడు. "రా... కూర్చో" అంటూ మర్యాద చేశాడు.
బెట్టు చేసింది. తీక్షణంగా అతని వైపు చూస్తూ కూర్చో  కుండా అలాగే నిల్చొంది.
 "ఇన్నాళ్ళు ఏమయ్యావు? కన్పించకుండా ఎక్కడికి వెళ్లావుఇల్లు ఖాళీ చేసేశావు. ఎక్కడున్నావు? అసలు నేను గుర్తు ఉన్నానా? కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. అంత బిజీనా? కనీసం చూడాలని కూడా అనిపించలేదా? మాట్లాడాలనిపించ  లేదా ? ...చెప్పు" అంటూ ప్రశ్న వర్షం కురిపించింది.
"నేను నిన్ను మర్చిపోతే కదా గుర్తుకు తెచ్చుకో వడానికి! అను క్షణం నా మదిలో నీ వే మెదలు తున్నావు. అయినా నిన్ను కలువలేక పోయాను! నీకోసం నిన్ను నాదాన్ని చేసుకోవడం కోసం, మీ నాన్నతో చేసిన ఛాలెంజ్ గెలవడం కోసం ఇన్నాళ్ళు కష్టపడ్డాను. అయినా నేను బిజీగా ఉన్నానని చెప్పను. ఎందుకంటే నీ కంటే ముఖ్యమైనది నాకు మరొకటి లేదు. నా కోసం నువ్వు నీ కోసం నేను పుట్టాం. మనల్ని ఎవ్వరూ విడదీయ లేరు. నేను ' లక్ష్యం' ఏర్పరచు కున్నాను. దాన్ని సాధించడం  కోసం నిరంతరం శ్రమిస్తున్నాను. అది సాధించాక మనం పెళ్లి చేసుకోవచ్చనుకున్నాను. అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు. నీ గురించి, నీ వైపు నుంచి ఆలోచించ లేక పోయాను. యాం సారీ..."
అతని మాటలు అమ్మాయికి కొంత ఊరటను కలగించాయ్. అయినా కోపం తగ్గలేదు. అలాగే నిల్చొని ఉంది.
"శిరీష! ప్లీజ్. నన్నర్థం చేసుకో. చూడు ఇప్పుడు కూడా నీ కవితనే చదువు తున్నాను. .."అంటూ వీక్లీ చూపించాడు.
అమ్మాయి సంతోషంతో పొంగిపోయింది. తనకు ఇష్టమైన రంగం గురించి మాట్లాడినా, పొగడినా సంతోషం కలగనిదెవ్వరికి! శిరీష సంతోషాన్ని అతడు గ్రహించాడు.
"నీ కవిత అద్బుతం. నాకు బాగా నచ్చింది. బావుంది. చాలా బావుంది. చాలా చాలా బావుంది. దాన్ని ప్రింట్ చేయించి, ఫ్రేం కట్టించి నా బెడ్ రూం లో పెట్టుకో బోతున్నాను".
సంతోషంతో పొంగిపోయింది గర్వంగా ఫీలయ్యింది. "చాలా ఎక్కువ చేస్తున్నావ్..." అని చిన్నగా నవ్వింది.
"హమ్మయ్య. కోపం తగ్గింది. అదే చాలు. నేను తప్పు చేశాను. ఇంకెప్పుడూ నీకు దూరం కాను! ప్లీజ్. నన్ను మన్నించి కూర్చో...ప్లీజ్!" బ్రతిమాలాడు.
"చాలాకాలం తరువాత కలుసు కున్నాము. అలా సరదాగా బయటికి వెళ్దామా? " అంది.
"ఎక్కడికి? హోటల్ కి వెళ్దామా?"
"ఊహూ! "
"గుడికి..."
"ఊహూ! మరెక్కడికైనా వెళ్దాం".
"నేనెక్కడికి వెళ్దామని చెప్పినా రానంటున్నావు. పోనీ నేవే ఎక్కడికెళ్ళాలో చెప్పు." అవకాశం శిరీషకు ఇచ్చాడు.
"పార్క్ కెళ్దామా?"
"నీ ఇష్టం" అని కాలింగ్ బెల్ నొక్కాడు. ఫ్యూన్ పరుగెత్తుకుని  వచ్చాడు. కారు తాళాలు అతనికి అందిస్తూ, "కారు బయటకు తీసుకురా..." అన్నాడు.
"కార్లో వద్దు. అలా సరదాగా వెళ్దాం"అంది.
ఫ్యూన్ కాసేపు అక్కడే నిలబడ్డాడు. విజయ్ ఏమీ చెప్పక పోయేసరికి, అమ్మాయి చెప్పిన మాటల్ని కన్ ఫర్మ్ చేసుకున్నాడు. తాళాలు టేబిల్ మీద పెట్టేసి, అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
"అంత దూరం నడిచి వెళ్ళాలంటే కష్టం. కనీసం బైక్ మీద వెళ్దామా?".

1 comment:

  1. Inni mosaalu chestunnaaraa...?? good story

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు