Saturday, April 27, 2013

రూలర్ సినిమా కథ-15


బోనులో ఉన్న విజయ్ దగ్గరకు వచ్చి ప్రశ్నించింది డిఫెన్స్ లాయర్ జ్యోతి.
"మీకు బినామీలు ఉన్నారా?
"లేరు".
"మీకు హాస్పిటల్స్, విద్యా సంస్థలు, వేల లారీలు ఉన్నాయని అందరూ అంటున్నారు. దానికి మీ సమాధానం."
"అవనీ అవాస్తవాలు. ఎవరో కావాలని పుట్టించిన పుకార్లు..."
"మీకు శత్రువులే మైనా ఉన్నారా?"
" అబ్జె క్షన్ యువరానర్! లాయర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. విజయ్ కు సంబంధించిన హాస్పటల్స్, లారీలు, విద్యాలయాలు...అన్నీ'శ్రీ కృష్ణా' పేరుమీదే ఉన్నాయి. అంతేకాదు! విజయ్ కు చెందిన 'ఆస్తులన్నీ' ఒకే అడ్రస్ పేరులో ఉన్నాయి. ఫాతిక సంస్థల కు  చెందిన రిజి స్ట్రేషన్ లన్నీ 'శిరీష ఇండ స్ట్రీస్ ఉన్న అడ్రస్ మీదే' జరిగాయి...కావాలంటే సిబి సేకరించిన ఆధారాలు పరిశీలించండి..."
జడ్జ్ చేతికి ఫైల్ అందింది.
"అబ్జె క్షన్ యువరానర్! శ్రీ కృష్ణుడు కోటానుకోట్ల ప్రజల ఆరాధ్య దైవం. పేరుతో చాలా సంస్థలు ఉన్నాయి. లయార్ చెప్పేది వింటుంటే ఆశ్చర్యం కలుగుతోంది. దేశంలో ' శ్రీకృష్ణా ' పేరుమీద ఉండే ఆస్తులన్నీ నా క్లయింట్ వే అనే టట్లు ఉన్నాడు! నా క్లయింట్ ఇంతకు ముందే చెప్పినట్లు శిరీష ఇండ స్ట్రీస్ లో సాధారణ ఉద్యోగి! కంపెనీ అడ్రస్ మీ వివిధ సంస్థలు ఉంటే కంపెనీ యజమానిని అడగాలి. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు  కంపనీకి సంబంధం లేకుండా  బయట చేసే ఉద్యోగాలకు కంపెనీ ఎటువంటి బాధ్యత వహించదు! సంబంధం లేని వాటిని నా క్లయింట్ కు అంట గట్టి, ముద్దాయిగా పేర్కొనడం భావ్యం కాదు. కేవలం ఊహాగానాలతో, అవాస్తవాల తో, మీడియా వార్తలతో కోర్టు వారిని నమ్మిస్తున్న లాయర్ పైన పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది...."అంది డిఫెన్స్ లాయర్ జ్యోతి.
సిబి లాయర్ రమేష్ వైపు చూశాడు.
 "మిలార్డ్! నేను ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. సిబి జెడి సేకరించిన ఆధారాలు నా దగ్గర చాలా ఉనాయి! హోటల్స్, హాస్పిటల్స్,విద్యాలయాల ప్రారంభో త్స వాల లో విజయ్  ఉన్న ఫోటోలు ఉన్నాయి. కృష్ణా నగర్ కాలనీ వాసులను ఉద్యోగాల్లో చేర్చుకోవాలని  శిరీష ఇండ స్ట్రీస్ కు , లారీ యజమానులకు విజయ్ రాసిన రాసిన రెకమెండేషన్ లెటర్లు ఉన్నాయి. వైద్యం కోసం వచ్చిన ఎంతోమంది కాలనీ వాసులకు, విద్యార్థులకు... సాయం చేయాలని  హాస్పిటల్స్ కు విద్యాలయాలకు రాసిన ఉత్తరాలున్నాయి...వాటన్నింటి మీద విజయ్ చేసిన సంతకాలు ఉన్నాయి.
  కావాలంటే పరిశీలించండి. ఇలా వైట్ కాలర్ నేరాలు చేసిన ముద్దాయిని కఠినంగా శిక్షించాలి. మరెవ్వరూ ఇటువంటి నేరాలకు పాల్పడకుండా చూడాలని కోర్టువారిని కోరుకుంటున్నాను..."
జ్యోతి వైపు చూశాడు లాయర్ రమేష్.ఆమె ముఖంలో ఆవేశం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. తరువాత సిబి జెడి ప్రకాష్ వైపు చూశాడు. అతని లో చిరునవ్వు కన్పించింది.
కోర్టులో సూది పడితే వినబడే టన్త నిశ్శబ్దం గా మారిపోయింది వాతావరణం.
కోర్టు సమయం అయిపోనట్లు 'బెల్' మ్రోగింది.
"కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను"అన్నాడు జడ్జ్.తరువాత డిఫెన్స్ లాయర్ జ్యోతి వైపుచూశాడు. "ఏమైనా ఉంటే రేపు కోర్టులో చెప్పు..."అన్నట్లుంది చూపు.
ఫైనల్ జడ్జ్ మెంట్ కోసమే కేసు మరుసటి రోజుకు వాయిదా వేశారనీ, తప్పకుండా వాళ్ళు కేసు ఓడి పోబోతున్నారని విజయ గర్వం తో నవ్వుకున్నాడు రమేష్.
జడ్జి తన సీట్లోనుండి లేచి వెళ్ళిపోయాడు.
సిబిఐ జెడి ప్రకాష్ పోలీసులతో కోర్టు బయటకు వచ్చాడు.
బయట ఉన్న జనసందోహం చూసి ఆశ్చర్య పోయాడు!
“ఏన్నో ఏళ్ళ తరబడి అణచివేతకు గురై ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని ప్రభుత్వం నిరంకుశత్వంతో అణచివేస్తున్న దృశ్యం లా ఉంది.”
అశేష జనవాహిని.
బారికేడ్ల ను ఏర్పాటు చేశారు పోలీసులు.
విద్యార్థులు, ఉద్యోగస్థులు, కృష్ణా నగర్ కాలనీ వాసులు, మద్దతు దారులు...పెద్ద సంఖ్యలో ఉన్నారు. "విజయ్ జిందాబాద్...విజయ్ ను విడుదల చేయాలి...విజయ్ మాదేవుడు.... విజయ్ నిర్దోషి..."లాంటి అరుపులతో కోర్టు ప్రాంగణమంతా హోరెత్తి పోయింది. జనాన్ని కంట్రోల్ చెయ్యలేక పోలీసులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం పారా మిలటరీ బలగాలను కూడా రంగంలోకి దింపింది!
విజయ్ ను అప్పటికప్పుడే చూడాలనే ధ్యేయంతో పట్టుదలగా ఉన్నారు!
పోలీసులు విజయ్ ను తరలించడానికి వ్యాన్ దగ్గరకు తీసుకెళ్ళారు.
విజయ్ చేతులు అలా పైకి ఊపాడు.
క్షణం కోసమే చూస్తున్నట్లు, బ్రతుకుతున్నట్లు జనం అరుపులు. కేకలు. ఈలలు. జిందాబాద్ ...లతో  ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది.
దృశ్యాన్ని చూసి సిబి జెడి తన ప్రక్కనే ఉన్న అనంత శర్మతో అన్నాడు.
"చూడు. అమాయక ప్రజలు. విజయ్ వాళ్లకు పప్పు బెల్లాలు పంచిపెట్టి వాళ్ళ ఆస్తులను దోచేశాడు. అయినా వాళ్ళ కళ్ళు మూసుకు పోయాయి. అవినీతి ఎంత వ్యవ స్థీకృత మై పోయింది. ప్రజలు ఎంత స్వార్ధ పరులు. అవినీతి వట వృక్షమై కళ్ళ ముందే అతని ఆస్తులు, వ్యాపారాలు కనబడుతున్నా, ఆధారాలతో చూపిస్తున్నా అతడ్నే కోరుకుంటున్నారు. ఆరాధిస్తున్నారు. ప్రేమిస్తున్నారు. అతని కోసమే జీవిస్తున్నట్లున్నారు..."
అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లు లోకల్ ఎస్సై మాట్లాడాడు.
"ఇంకా అతను అవినీతి పరుడని కోర్టు ఫ్రూవ్ చేయలేదు కదా సర్!"
దెబ్బతిన్నట్లు అతని వైపు చూశాడు సిబి జెడి ప్రకాష్.
క్షణంలో తను సురేష్ ను అరెస్ట్ చేసినప్పుడు, సి.ఎం. గురించి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఒక పదునైన బాణం వచ్చి తన హృదయానికి గుచ్చు కున్నట్లు విలవిల్లాడి పోయాడు.
ఒకరు న్యాయాన్ని కాపాడడానికి అలా మాట్లాడితే మరొకరు అన్యాయానికి సపోర్ట్ చేస్తూ ఇలా మాట్లాడారు.
"ఇద్దరికీ ఎంత తేడా !"
*****

"మళ్ళీ ఒకసారి నా సాక్షి ని విచారణ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్తువారిని ప్రార్ధిస్తున్నాను..." అంది డిఫెన్స్ లాయర్ జ్యోతి.
"అబ్జె క్షన్" అన్నాడు సిబి లాయర్ రమేష్.
"ఆఖరి అవకాశం అడగటం లో తప్పేముంది ?" అంది జ్యోతి రిక్వెస్ట్ గా . అవి సి బి లాయర్ని ఎగతాళి చేసే టట్టు న్నాయి. అతను గ్రహించాడు. అయినా చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాడు.
"అబ్జె క్షన్ వర్ రూల్ద్" అన్నాడు జడ్జ్.
మెజిస్ట్రేటు అనుమతి ఇవ్వగానే విజయ్ దగ్గరకు వెళ్ళింది జ్యోతి.
" ఫోటోలు, రెకమెండేషన్ లెటర్లు నీవేనా?".
"అవును".
"వాళ్ళు నీకేమవుతారు. ..ఎందు కెళ్ళావు?"
"ఆయా సంస్థల యజమానులలో చాలా మంది నా కొలీగ్స్, స్టూడెంట్స్ ,వారి పేరెంట్స్, ఫ్రెండ్స్ ఉన్నారు! వారు మమకారంతో పిలిస్తే వెళ్లాను. కొన్నింటికి మొహమాటంగా, మరికొన్నింటికి తప్పనిసరిగా! అలాగే కాలనీ వాసుల్లో చాలామంది పరిచయం ఉన్న వాళ్ళు తిండిలేక, విద్య, వైద్యం లేనివాళ్ళు సాయం అడిగితే రికమెండ్ చేశాను. నేను రికమెండ్ చేసిన వాళ్ళ ని చాలామంది ని తీసుకోలేదు. తీసుకున్న వారిని కూడా చాలా మందిని తీసేశారు. టాలెంట్ ఉన్నవాళ్ళకు , కష్టపడే వాళ్ళ కు మాత్రమె ఉద్యోగాలు ఇచ్చారు. అందరికీ అవ్వలేదు! నా సంస్థలు అయితే అలా చేసేవాళ్ళు కాదుకదా!"
"దట్సాల్ యువరానర్! నా క్లయింట్ అమాయకుడు . నిర్దోషి. సాక్షాధారమూ లేకుండా సమాజంలో పది మందికి సేవ చేస్తూ ఒక మంచి పౌరుడిగా ఉన్న నా క్లయింట్ ను కోర్టుకు ఈడ్చారు. అతడి పరువు, ప్రతిష్ట లను మంట గలిపారు. అవినీతి పరుడని పుంఖాను, పుంఖాలు గా ఆర్టి కల్స్ రాశారు. అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వం అండదండలతో సిబి నా క్లయింట్ ను అరెస్ట్ చేసింది. ఇలా నా క్లయింట్ పై తప్పుడు కేసులు పెట్టిన వారిపై త్వరలో చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం..."
సిబిఐ లాయర్ మాట్లాడలేదు!
సిబిఐ జెడి వైపుచూసింది లాయర్ జ్యోతి. అతడి ముఖంలో జీవం లేదు. సిగ్గుతో తల వంచుకున్నాడు.
రెండ్రోజుల్లో జడ్జ్ మెంట్ కాపీ బయటకు వచ్చింది. జడ్జ్ మెంట్ కాపీ చదివి విన్పించారు.
"విజయ్ నిర్దోషి! అతడు తప్పు చేసినట్లు, అక్రమాలకూ పాల్పడి  నట్లు రుజువులు లేనందున కోర్టు నిర్దోషిగా  విడుదల  చేసింది. అలాగే సంఘటనలకు భాధ్యలైన అసలు దోషులను పట్టుకోవాలనీ, సంఘంలో పెద్ద మనుషులుగా ఉన్న వారి పట్ల వ్యక్తి స్వేచ్చ కాపాడాలనీ పోలీసులకు తెలిపింది. తప్పుడు కేసులు పెట్టకూడదని సిబి కి చురకలు అంటించింది..."
జడ్జ్ మెంట్ వినగానే కోర్టు బయట ఉన్న జనంలో హర్షాతిరేఖలు మిన్నంటాయి. విజయ్ ను చూడగానే వచ్చి జేజేలు పలికారు. అతడ్ని దేవుడిలా ఊరేగించారు. ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అలా విజయ్ జనంలో తారక రాముడిలా ఊరేగుతున్నాడు.
విజయ్ ను అలా చూస్తుండి పోయింది జ్యోతి. సిబి జెడి ఆమె దగ్గరికి వచ్చాడు.
"మీలాంటి లాయర్లు ఉన్నారని ఆనాడు గాంధి ని చంపిన గాడ్సేకి తెలి సుంటే  తలెత్తుకుని , కాలర్ ఎగరేసుకుని తిరిగేవాడు... !"
చాలా పదునైన మాటలు. ఆమె హృదయానికి సూటిగా గ్రుచ్చుకున్నాయి. పదునైన బాణం వచ్చి తన  హృదయానికి గ్రుచ్చు కున్నట్లు బాధ తో విలవిల్లాడి పోయింది.
*****
సన్మాన సభ
భారీ బహిరంగ సభ లో విజయ్ కు సన్మానం.
విజయ్ కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సన్మాన సభ.

4 comments:

  1. This is related to Jagan. If they are not changed the story it won't release in AP.

    ReplyDelete
  2. Nobody can stop balayya.

    ReplyDelete
  3. Good story. Ee cinema Balayya career lo Biggest Hit avuthundi.

    ReplyDelete
  4. Excellent Story...See how White caller crime people escape after CBI shows Proofs...Good story...If the people are innocent Politicians become like this...If this movie can create history..? Change the lives of people...?

    ReplyDelete

మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు