నేస్తమా,
ఏమని చెప్పను... ఎలా మొదలెట్టను ?
ఎలా రాయెను నీ మనసు నొప్పించాననీ...
హాస్పిటల్లో ఉన్న నిన్ను చూడాలి ఉంది. ఇనుప సంకెళ్ళను తెంచుకుని నీ దగ్గరకు వెళ్లాలని ఉంది. నా ఆశయం కోసం నీప్రేమను పోగొట్టుకున్నాను.తాత్కాలికంగా మనం విడిపోయినా నీ జ్ఞాపకాలు నాతోనే ఉన్నా యి. నా ఆశయం కోసం నేను తీసుకున్న కఠిన నిర్ణయాలు తప్పుకాదనిపించిది. దాని మూలంగా కోటాను కోట్లమంది తరతరాలుగా సంతోషంగా ఉంటారు!ఆశయం గొప్పది. కష్ట పడ్డాను .సాధించాను. కానీ నీ ప్రేమలో ఓడిపోయాను.
జీవిత లక్ష్యాన్ని గెలిచే ప్రయత్నంలో ప్రేమకు దూరం అయ్యాను. దాన్ని ఇలా నీ దగ్గర వెతుక్కునే ప్రయత్నమే ఇదంతా. ఆశయ సాధన కోసం నిన్ను నిర్లక్ష్యం చేశాను. నీ మనసు నొప్పించాను. మన్నించు. నన్ను క్షమిస్తే, ఆనాడు నాఇoటి ముందు, గుమ్మంలో ఫ్లవర్ బోకే తో నిల్చొన్న అందమైన నీ రూపాన్ని తలచుకుంటూ నా జైలు జీవితం గడిపేస్తాను. ఆతరువాత...
ప్రేమతో,
విజయ్.
ఆమె ఆ ఉత్తరాన్ని అలాగే తన రెండు చేతులతో దగ్గరకు తీసుకుని పెదవులతో ముద్దుపెట్టుకుంది.
శుభం.
climax baavundi
ReplyDeleteclimax is super
ReplyDelete